“యువశక్తి ఏర్పాట్లు పరిశీలన చేసిన నాదెండ్ల”

Spread the love

Youth Shakti Arrangements Examined Nadendla

“యువశక్తి ఏర్పాట్లు పరిశీలన చేసిన నాదెండ్ల”

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని తాళ్లవలసలో జనవరి 12న తలపెట్టిన యువ శక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పార్టీ PACS ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.శనివారం సాయంత్రం ఆయన యువ శక్తి సభా ప్రాంగణంలో ఏర్పాట్లును సమీక్షించారు.నాయకులు,కార్యకర్తలకు యువశక్తి కమిటి నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుండి జన సైనికులు ఈ కార్యక్రమానికి వస్తారన్నారని తెలిపారు.జగన్ యువతికి ఉపాధి ఏ గ్రామంలోనైనా కల్పించరా అని నాదెండ్ల మండిపడ్డారు.యువశక్తి పేరిట న్యాయ విభాగాంలో 32 మంది న్యాయవాదులను ఇప్పటికే నియమించామని,అవసరమైతే న్యాయవాదులను నియమిస్తామని తెలిపారు..

మత్స్యకారుల సంక్షేమానికి రాయితీ చర్యలు తీసుకోకుండా స్థానిక నేతలు ప్రకటనలతోనే పబ్బం గడుపుతున్నారని,యువశక్తి సభా స్ధలి పై వందమంది యువతతో వివిధ అంశాలపైన నేరుగా జనసేన అధినేతతో అభిప్రాయ సేకరణ తీసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు..

ఇప్పటికే జిల్లా పోలీసుల ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రే సభ నిర్వహణ,సమావేశం ఏర్పాటు అంశంపై అనుమతి పత్రాలు అందించారని మీడియా ముందు లిఖిత పూర్వక కాపీ ఉంచారు.అందుకు గాను నాదెండ్ల పోలీసు అధికారులకు కృతజ్ఞలు తెలిపారు.శుక్రవారం బుడగట్లపాలెం ఫీషిగ్ హార్బ పర్యటనలో మంత్రి సీదిరి పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలోనే కాకుండా మీ నియోజకవర్గానికే వస్తాను..

అక్కడ మాట్లాడుకుందామని నాదెండ్ల మంత్రి సీదిరికి సవాల్ విసిరారు.సంక్షేమం పేరిట అర్హులైన మత్స్యకారులకు వంద శాతం న్యాయం చేసారా అంటూ నాదెండ్ల మంత్రి సీదిరికి మరో సూటి ప్రశ్న వేశారు.అనంతరం రణస్థలం మండలం పైడిబిమవరం పంచాయతీ నుండి పలువురు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.

Related Posts

You cannot copy content of this page