రూ.56 కోట్లతో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్

Spread the love

Four Lane Steel Bridge on Subhash Nagar Pipe Line Road at a cost of Rs.56 Crores

రూ.56 కోట్లతో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్…

ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు చెక్…

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అభ్యర్థన మేరకు నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీ కేటీఆర్…

టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభం…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పలు మార్లు అసెంబ్లీ వేదికగా.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు మంత్రి కేటీఆర్ స్పందించారు.

ప్రత్యేక జీఓ నెంబర్ 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు చేశారు. మెదక్ రోడ్డు నుండి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ సుమారు 3.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రధాన లింకు రోడ్డులో వాహనదారులతో పాటు పరిశ్రమలు ఉన్నందున భారీ వాహనాలు కూడా ప్రయాణించడంతో సింగిల్ లైన్ వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.

ప్రజల ఇబ్బందులు స్వయంగా గుర్తించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ని అభ్యర్థించారు. దీని దృష్ట్యా సమస్య శాశ్వత పరిష్కారానికి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం 60 ఫీట్లు ఉన్న రోడ్డులో 80 ఫీట్లు వెడల్పుగా నాలుగు వరుసలతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఫేస్-2 కింద టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తన అభ్యర్థన మేరకు స్పందించి రూ.56 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ప్రజల తరపున మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page