Happy New Year to MLA
ఎమ్మెల్యే కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గం బి.ఆర్.ఎస్. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘం సభ్యులు, అభిమానులు మరియు స్థానికులు..
సాక్షిత : ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బి.ఆర్.ఎస్. పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,
వివిధ బస్తి కాలనీ ల సంక్షేమ సంఘం సభ్యులు, వివిధ శాఖల అధికారులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు