Smart Kidz in Spire-2022 is a mirror of creativity
సృజనాత్మకతకు అద్దం పట్టిన స్మార్ట్ కిడ్జ్ ఇన్ స్పైర్-2022
ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
అణువు నుండి అంతరిక్షం దాకా అన్ని అంశాలను ప్రదర్శించి నగరంలోని “స్మార్ట్ కిడ్జ్” పాఠశాల చిన్నారులు తమ సృజనాత్మకతను నిరూపించుకున్నారు.
ఉత్సాహంగా సాగిన ఇన్ స్పైర్-2022ను జిల్లా పరిషత్ చైర్మన్
లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. చిన్నారుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి వారి నుండి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ముఖ్యంగా రోడ్ సేఫ్టీ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు పాటించవలసిన జాగ్రత్తలు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడే దిశగా జాగ్రత్తలు అదేవిధంగా బాధ్యతలను గుర్తు చేస్తూ, రవాణా మార్గం, వాయు మార్గం, జలమార్గం,పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు,సౌర శక్తి, సోలార్ విద్యుత్ ఉపయోగాలు ఇంధన ఉత్పత్తి దాని ద్వారా జరిగే ప్రయోజనాలు, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన దాని ఉపయోగాలు, ప్రస్తుత నడుస్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు తగు జాగ్రత్తలను పాటించడం తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యార్థులు చక్కగా వివరించారు.
అదేవిధంగా రాజ్యాంగం దాని హక్కులు దాని బాధ్యతలు, పార్లమెంట్ భవనం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ చిన్ననాటి నుండే విజ్ఞానం ఆలోచన శైలి, జ్ఞానం పెరగాలంటే ఇలాంటి ఇన్ స్పైర్ లు విద్యార్థులకు చాలా అవసరం అని,
దానికి అనుగుణంగా పాఠశాల యాజమాన్యం ఇలాంటి ఇన్ స్పైర్ కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని, ఆయన అన్నారు. ఎంతో జ్ఞానంతో ముందుచూపుతో వారి జ్ఞానంతో చిరుప్రాయంలోనే వారి ఆలోచనను ప్రదర్శన రూపంలో నిలపటం పట్ల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు చదువులో రాణించి మంచిత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసమే తాము ప్రతి సంవత్సరం “ఇన్ స్పైర్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని చదువుతోపాటు వారి ఆలోచన శైలి వారి ఆలోచన విధానం తదితర అంశాలతో కూడిన ప్రదర్శన విద్యార్థులు నిర్వహించారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రామచంద్రరావు కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ అదేవిధంగా టూ టౌన్ సిఐ శ్రీధర్, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.