TPCC Vice President Dommati Sambaiah, who participated in KCR effigy burning, dharna and Rastaroko, speaks
TPCC ఆదేశాల మేరకు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో
తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ & సోషల్ మీడియా వార్ రూమ్, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కార్యాలయం పై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల నిరసనగా హనుమకొండ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం, ధర్నా, రాస్తారోకోలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతు
భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల లో పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. ప్రతి పౌరుడు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. మాటలు, రచనలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియ జేయవచ్చు. తన భావాలే కాకుండా ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది.
సోషల్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల, అవినీతి మీద ప్రజలకు తెలియజేస్తూ చైతన్య పరుస్తుంటే
TRS ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అరెస్టుల ద్వారా అణిచివేస్తుంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు