SAKSHITHA NEWS

Prepare houses for house entry – Commissioner Anupama Anjali

గృహప్రవేశాలకు ఇళ్ళను సిద్దం చేయండి – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత తిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణాలు మొదటి దశ పనుల్లో భాగంగా పూర్తి చేసిన వాటిని ఈ నెల 21న గృహప్రవేశాలకు సిద్దం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.

తిరుపతిలో మునిసిపల్ పరిధిలో నివాసం వుంటూ అర్హులైన ప్రజలకు కేటాయించిన లే అవుట్లలో ఒకటైన వడమాలపేట మండలం కల్లూరు వద్ద నిర్మిస్తున్న జగనన్న ఇళ్ళ నిర్మాణాలను గురువారం కమిషనర్ అనుపమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ డిసెంబర్ 21న మొదటి దశలో ప్రారంభంకానున్న గృహ ప్రవేశాలకు వీలైనన్ని గృహాలను సిద్దం చేయాలని ఆదేశించారు.

గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, ఇటుకలను నిర్మాణాలు జరుగుతున్న స్థలాలకు దగ్గర్లో వుంచుకోవాలని, రానున్న వర్షాలను దృష్టిలో వుంచుకొని పనులను పర్యవేక్షించాలన్నారు.

అనుకున్న సమయంలోపు నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొని పనులను కొనసాగించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు జారీ చేసారు. నిర్మిస్తున్న ఇళ్ళ యజమానులను పనులు జరిగే స్థలాలకు తీసుకొచ్చి వారిని కూడా భాగస్వామ్యులను చేయాలని కమిషనర్ అనుపమ అంజలి సూచించారు. కమిషనర్ వెంట లే అవుట్ ఇన్ చార్జ్ డిఈ రవీంధ్రరెడ్డి, అమ్నెటి సెక్రటీరీలు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS