Islam’s message to FIFA World Cup sports fans
ఫిఫా వరల్డ్ కప్ క్రీడాభిమానులకు ఇస్లామ్ సందేశం
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ఫిఫా వరల్డ్ కప్ కు ఫస్ట్ టైం ఓ అరబ్ కంట్రీ వేదికగా మారింది. ఖతర్ కంట్రీలోని దోహాలో ఫుట్ బాల్ పోటీలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ఫిఫా ఫుట్ బాల్ ను కనులారా వీక్షించేందుకు క్రీడాభిమానులు తరలి రానున్నారు.
వారందరికీ ఆతిథ్యం అదిరిపోయేలా చేయాలని ఖతర్ గవర్నమెంటు నిర్ణయించింది. పనిలో పనిగా ఇస్లామిక్ సంప్రదాయాలు, అరబ్ కల్చర్, ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఇదొక సువర్ణావకాశంగా భావించింది. స్డేడియంల దగ్గర ముహమ్మద్ ప్రవక్త బోధనలతో కూడిన పెద్ద పెద్ద హోర్డింగులు, పలు పలుభాషల్లో ముద్రించిన ఇస్లామ్ సందేశ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచింది.
ఇస్లామ్ గురించి సందేహాలు నివృత్తి చేసేందుకు వందలాది మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చింది. తమదేశం వచ్చే విదేశీ క్రీడాభిమానులకు ఇస్లామ్ ధర్మం గురించి ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించడమే కాకుండా సరైన అవగాహన కల్పించేందుకు పలు విదేశీ భాషల్లో కరపత్రాలు ముంద్రించింది.
వరల్డ్ కప్ నిర్వహణకు సుమారు 8 స్టేడియాలు నిర్మించింది. స్డేడియాల ప్రాంగణంలో నమాజు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. వుజూ కొలనులు నిర్మించింది. అక్కడి నిషిద్ధాల గురించి అవగాహనకల్పించేలా బోర్డులు ఏర్పాటు చేసింది. ఆల్కహాల్, వ్యభిచారం, స్వలింగ సంపర్కం లాంటివన్నీ షరీఅత్ నిషేధించిన పనులు.