Members of QMRSMA who met the MLA
ఎమ్మెల్యేను కలిసిన క్యూఎంఆర్ఎస్ఎంఏ సభ్యులు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పాఠశాలలకు ట్రేడ్ ట్యాక్స్ వేస్తూ జీహెచ్ఎంసీ వారు నోటీసులు ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, తమ పాఠశాలలు సర్వీస్ హెక్టార్ కిందకు వస్తాయని, ట్రేడ్ కిందకు రావని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు.
దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్యూఎంఆర్ఎస్ఎంఏ చైర్మన్ పి.శివయ్య, అధ్యక్షుడు ఆర్.వరప్రసాద్, కార్యదర్శి మహేష్ కుమార్, కోశాధికారి జె.దయాకర్, ముఖ్య సలహాదారుడు మండవ శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, ముబసీర్, భాస్కర్ రాజు మరియు జావేద్ అలీ పాల్గొన్నారు.