Illegal mining in ponds
చెరువుల్లో అక్రమ మైనింగ్…
అడిగే వారెవ్వరు, అంతా మాయిష్టం, అనే విధంగా ఇస్తానుసారం మట్టి మాఫియా రెచ్చిపోతోంది, డబ్బులు కట్టే మట్టి తొలుకుంటున్నాం, అంటూ కాంట్రాక్టర్ సమాధనం ఇస్తున్నారంటూ తెలియజేసారు. కాగా గ్రామస్థులు రెవెన్యూ శాఖకు సమాచారం అందించిన స్పందించని అధికారులు, ఒకేసారి వేరువేరు చోట్ల మైనింగ్, పట్టభూములపై మట్టి రాబందులు కన్ను ఇస్టాను సారం తవ్వకాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మట్టి మాఫియా మళ్ళీ పుంజుకుంది,ఇటీవలే జిల్లా కలెక్టర్ మట్టి మాఫియా విషయంపై స్పందించి స్థానిక రెవెన్యూ అధికారులకు మొట్టికాయ వేయడంతో సన్నబడ్డ మాఫియా మళ్ళీ పూర్వ వైభవం పుంజుకుంటున్నది, ఒకేరోజు వేరువేరూ చోట్ల మైనింగ్ జరిగినట్లు సమాచారం .అశ్వారావుపేట మండలం మొద్దులగూడెం గ్రామ శివారు పట్టభూములలో జేసీబీ నెంబర్ TS 28 G 7367, మరియు సుమారు 20 ట్రాక్టర్లతో తవ్వకాలు జరిపితే నేనేమి తక్కువ కాదని మరోపక్క ఓ వ్యక్తి జమ్మిగూడెం చెరువులో జేసీబీ నెంబర్ TS 04 EX 6882 సుమారు 15 ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టి అమ్మకాలు జరుగుగున్న, పట్టించుకునే అధికారులే లేకపోవడం విడ్డురంగా ఉందని గ్రామస్థులు తెలియజేసారు, అధికారులకు సమాచారం అందించినా స్పందించక పోవడానికి DD రూపంలో చెల్లించిన వేలాది రూపాయలే కారణం అంటూ పలు వాదనలు వినబడుతున్నాయి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడమే ఈ వ్యవహారం మొత్తానికి కారణం అంటూ అధికారులు తీరును పలువురు విమర్శించారు.