SAKSHITHA NEWS


Kabaddi Champion Nalgonda

కబ’ఢీ‘ ఛాంపియన్ ‘ నల్గొండ’

  • రన్నర్‌గా నిలిచిన రంగారెడ్డి
  • పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ నల్గొండ , రంగారెడ్డి లదే మొదటి, ద్వితీయ స్థానాలు
  • విజయవంతంగా ముగిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ ఛాంపియన్ షిప్ ట్రోఫీ
  • పురుష, మహిళా జట్ల విజేతలకు ట్రోఫీ తో పాటు రూ.లక్ష నగదు బహుమతి
  • ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • కోలాట నృత్యం, బాణసంచా వెలుగుల మధ్య వేదిక పైకి శీనన్న కు ఘన స్వాగతం
  • ముగింపు కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరు
  • యువజన విభాగం భీమనాథుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పొంగులేటికి ఘన సన్మానం

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాల్లో భాగంగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ ఛాంపియన్ షిప్ ట్రోఫి ఆదివారం విజయవంతం గా ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు పై నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో కూడా రంగారెడ్డి జట్టుపై నల్గొండ జట్టు విజేతగా నిలిచింది.

విజేతలుగా నిలిచిన పురుషుల విభాగం నల్గొండ జట్టుకు, మహిళా విభాగం నల్గొండ జట్టుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఛాంపియన్ షిప్ ట్రోఫితో పాటు రూ. లక్ష నగదు ను మొదటి బహుమతిగా అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పురుషుల రంగారెడ్డి జట్టు కు, మహిళల రంగారెడ్డి జట్టు కు రూ. 75 వేల చొప్పున నగదు బహుమతులుగా అందజేశారు. ఇరు విభాగాల్లోనూ నల్గొండ, రంగారెడ్డి జట్లు మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలవడం విశేషం.

  • తర్వాత స్థానాల్లో నిలిచిన ఆరు గురికి కూడా…
    మొదటి రెండు స్థానాల్లో కాకుండా తర్వాత ఆరు స్థానాల్లో నిలిచిన పురుషుల, మహిళల జట్లకు కూడా నగదు బహుతులను అందజేశారు.
  • తృతీయ స్థానం రూ. 50వేలు, నాల్గవ స్థానం రూ. 40వేలు, ఐదవ స్థానం రూ. 30వేలు, ఆరవ స్థానం రూ. 20వేలు, ఏడవ స్థానం రూ. 15వేలు, ఎనిమిదవ స్థానం లో నిలిచిన ఇరు విభాగాల జట్లకు రూ. 10వేలను నగదు బహమతులుగా అందజేశారు. అదేవిధంగా వ్యక్తిగత ప్రతిభతో ఆటలో రాణించిన ఉత్తమ రైడర్, ఉత్తమ డిఫెండర్లుకు సైతం నగదు బహుమతులను అందజేశారు.

  • పొంగులేటి కి ఘన స్వాగతం…
    పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి కి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కోలాట నృత్యం, బాణాసంచా వెలుగుల మధ్య పూలు చల్లుతూ శీనన్నను వేదిక పైకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన పురుషుల, మహిళల ఫైనల్ పోటీలను శీనన్న కబడ్డీ ఆడి ప్రారంభించారు.

  • అట్టహాసంగా ముగింపు…
    మూడు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమాన్ని నిర్వాహకులు అట్టహాసంగా ముగించారు. పోటీల సందర్భంగా నిర్వహించిన కళా,సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. బాణాసంచాల వెలుగుల మధ్య ముగింపు వేడుక ఘనంగా సాగింది.

  • ముఖ్య అతిథులు వీరే…
    పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. జగదీశ్వర్ యాదవ్, డీవైఎస్ వో పరంధామిరెడ్డి , కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జారే ఆది నారాయణ,
  • లేళ్ల వెంకట్ రెడ్డి, ఏసీపీ ప్రసన్న కుమార్, సీఐ లు చంటి శ్రీధర్, అంజలి, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, మద్దినేని బేబి స్వర్ణకుమారి , మట్టా దయానంద్, పిడమర్తి రవి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆకుల మూర్తి, చావా శివరామకృష్ణ, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకని జైపాల్, వైరా నియోజక వర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాస రావు, ఎంపీపీ లు సామినేని హరి ప్రసాద్, గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, చావా నారాయణ , గుర్రం తిరుమల రావు, సామినేని వెంకటయ్య, పోటీల ఆర్గనైజర్ కటికల క్రిస్టోఫర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

  • యువజన విభాగం ఆధ్వర్యంలో పొంగులేటికి ఘనసన్మానం…
    తమ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి యువజన విభాగం ఘన సన్మానం నిర్వహించింది. యువజన విభాగం నాయకులు భీమనాథుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో పొంగులేటిని సత్కారించారు. తలపాగ, తల్వారు అందజేసి తమ అభిమానన్ని చాటుకున్నారు. వీరితో పాటు ఇంకా అనేక మంది నాయకులు , అభిమానులు పొంగులేటి ని ఘనంగా సత్కరించారు.

  • పోటెత్తిన ‘జనం’…
    చాలా కాలం తరువాత రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగడంతో ఖమ్మం నగరంలోని క్రీడాభిమానులతో పాటు జిల్లా నలుమాలల నుంచి వందలాది మంది పోటీలను వీక్షించేందుకు హాజరైయ్యారు. అంచనాకు మించి జనం రావడంతో పటేల్ స్టేడియం జనసంద్రంతో కిక్కిరిసింది. పోటీల మూడు రోజులు కూడా ప్రజల నుంచి విశేష ఆదరణ కనిపించింది.

SAKSHITHA NEWS