Our government's program for Gadapa Gadapa
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సచివాలయం పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పాలన మరియు వినుకొండ నియోజకవర్గ లో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు.
ప్రతి పక్ష పార్టీల వారి లాగా జన్మభూమి కమిటీ లను పెట్టి వారికీ అనుకూలమైన వారికి మాత్రమే మొఖాలను చూసి ఫించన్, ఇతర ప్రభుత్వ నుండి వచ్చే లబ్దిని ఇచ్చే పద్ధతులు ఇప్పుడు లేవని, జన్మభూమి కమిటీల పేరుతో అన్యాయంగా ప్రజల సొమ్మును మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టారని ఆరోపించారు.
అలాగే, గతంలో ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇళ్ళ ముందుకు వచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవటం కోసం ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెలుతున్నామని తెలిపారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని తెలుకోడమేమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే, ఈ ప్రతిపక్ష నేతలు ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
మీ ప్రభుత్వం లో మీరు అందించిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పమని అడిగితే ఆ ప్రశ్న కు సమాధానం లేదని అన్నారు. ఈ సచివాలయం పరిధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతీ గ్రామానికి కోట్ల రూపాయలు ప్రజల అభ్యున్నతికి, మరియు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసారని తెలిపారు.
అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో శాసనసభ్యులు దృష్టికి వచ్చిన సమస్యలని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖా అధికారులని ఆదేశించారు.