SAKSHITHA NEWS

స్పందన అర్జిలపై సకాలంలో స్పందించాలి – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : స్పందన కార్యక్రమంలో వచ్చే పిర్యాధులు, అర్జీలపై సకాలంలో స్పందించాలని అధికారులనుద్దెసించి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం జరిగింది. డయల్ యువర్ కమిషనర్ కు వచ్చిన ఓక ఫోన్ కాల్ లో పట్నూలువీధి శివాలయం వద్ద చెత్తను సరిగా తీయడం లేదనే పిర్యాదుపై స్పందిస్తూ వెంటనే క్లీన్ చేయిస్తామన్నారు. ఎల్.ఐ.సి. రోడ్ గుంతలమయమని, రోడ్డును వేయించాలనే పిర్యాదుపై స్పందిస్తూ తమ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించిన తరువాత తగు చర్యలు తీసుకుంటామన్నారు. హరిచంధ్ర శ్మశానం వద్దనున్న కొంత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారనే పిర్యాదుపైన అదేవిధంగా ఎల్.బి.నగర్లోని మునిసిపల్ బావిని ఆక్రమించి షెడ్డు నిర్మిస్తున్నారనే పిర్యాదుపై స్పందిస్తూ తమ ప్లానింగ్ అధికారులు వెంటనే పరిశీలించి తగు చర్యలు చేపడుతామన్నారు. పూలవానిగుంటలో రోడ్లు, డ్రైనేజి, తెలుగుగంగ నీటి సౌకర్యం కల్పించాలని కొంతమంది ఆ కాలనీ వాసులు అర్జి సమర్పించగా తమ ఇంజనీరింగ్ అధికారులు కాలనీకి వచ్చి పరిశీలించిన అనంతరం చేపట్టబోవు పనుల వివరాలను కౌన్సిల్ దృష్టికి తీసుకెల్లి పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. గత వారం వచ్చిన పిర్యాదులపై కమిషనర్ అనుపమ చర్చిస్తూ ఎన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది అనే వివరాలను తెలుసుకోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల నుండి డ్రైనేజి పొంగుతున్నాయనే పిర్యాదులపై స్పందిస్తూ వెంటనే వాటిని శుభ్రం చేయించాలని అధికారులకు కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, లోకేష్ వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, సెక్రటరి రాధికారెడ్డి, ఎసిపిలు షణ్ముగం, బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు విజయకుమార్ రెడ్డి, దేవిక, రవీంధ్రరెడ్డి, సంజయ్ కుమార్, గోమతి, మహేష్ ఎలక్ట్రికల్ డిఈ నరేంధ్ర తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS