SAKSHITHA NEWS

Estimated cost of around Rs.20 lakhs from own funds

Estimated cost of around Rs.20 lakhs from own funds

సాక్షిత : భారతినగర్ డివిజన్ పరిధి లో నీ ఎం.ఐ.జి కాలనీ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి మరియు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి స్వంత నిధులతో సుమారుగా రూ.20 లక్షల రూపాయల అంచనావ్యయం తో నిర్మించిన సీనియర్ సిటిజెన్ భవనం ను కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి ,స్థానిక సీనియర్ సిటిజన్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ భవన్ కు దాదాపు 20 లక్షల తో అదనపు గదుల నిర్మాణం కొరకు ఎం.ఎల్.ఏ సి.డి.పి నిధులతో మరియు కార్పొరేటర్ స్వంత నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపట్టడం జరిగింది. .

సీనియర్ సిటీజన్ భవన్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇక్కడి ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా సీనియర్ సిటిజన్ భవన్ లో సమావేశాలు, సభలు, నిర్వహించుకునేందుకు వీలుగా అదనపు గదులు నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు.

అదేవిధంగా. మరియు కాలక్షేపం కోసం సేద తీరేందుకు, ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగినది అని, MIG అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .భారతి నగర్ డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

కాలనీ వాసులు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ భవనం నిర్మాణం కు నిధులు కేటాయించి సహాకరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ   శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు .

ఈ కార్యక్రమంలో GHMC ఈ ఈ శ్రీనివాస్, DE రమేష్, AE రమేష్ మరియు
హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి జి ఎం రాజశేఖర్ ,మేనేజర్ సుబ్రమణ్యం, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్,నాగమణి,MIG తెరాస అధ్యక్షుడు భాస్కర్ ,తెరాస సీనియర్ నాయకులు

ఆదర్శ్ రెడ్డి, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, సత్యనారాయణ,నర్సింహ రావు,సుబ్బారావు,నాగేశ్వర్ రావు, సురేంద్ర, ఐ.వి.రాజు,కాలనీ అద్యక్షుడు బాలయ్యా,డైరెక్టర్ సత్యనారయణ,సుబ్బా రావు,కరుణాకర్, ముదిరాజ్,సంపత్ గౌడ్,రాజు,మహిళ అధ్యక్షురాలు జ్యోతి,అనిత,సంధ్య,లక్ష్మీ,స్వర్ణ లత, సురేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS