జాతీయ పిత మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జాతీయ పితా మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్ లోని అవమానానికి గురి చేయడం జాతీయ యావత్తు మొత్తాన్ని అవమానించడమే

భారతదేశ స్వాతంత్రం కోసం
ఏన లేని పోరాటం చేసి స్వాతంత్రం సాధించడంలో అమోఘమైన పాత్ర పోషించిన భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ గారిని పశ్చిమబెంగాల్లో అఖిల భారత హిందూ మహాసభ పేరుతో ఏర్పాటు చేసిన కాలిక దేవి ఉత్సవ విగ్రహం వద్ద, ఓ రాక్షసుడు ఉండే స్థానంలో మహాత్ముని విగ్రహాన్ని పెట్టి ఘోరంగా అవమానించిన సంఘటనకు నిరసనగా, కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన జమ్మికుంట పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది ఆర్యవైశ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మహాత్మ గాంది విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించడం జరిగింది. మహాత్ముని అవమానించినవారు ఏ స్థాయిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారి పైన కేసులు నమోదు చేసి శిక్షించకపోతే దేశవ్యాప్తంగా మహాత్మానికి జరిగిన అవమానానికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రజాప్రతినిధులు ఆర్యవైశ్య మహాసభ పక్షాన జిల్లా అధ్యక్షులు చందా రాజు ప్రకటించారు. గత కొంతకాలంగా మహాత్ముని అవమానించడమే పనిగా పెట్టుకున్న కొంతమంది తమ ఇష్టానుసారం గా వ్యవహరిస్తూ రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారని, ఆర్యవైశ్య సంఘాలు ఆరోపించాయి. మహాత్ముడు దేశం కోసం చేసిన పోరాటాలు త్యాగాలపై దేశంలో ఎక్కడ చర్చ ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉన్నారని మహాత్ముణ్ణి విమర్శించేవారు అందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు .ఇకనైనా ఈ దగుల్బాజీలు మహాత్ముని విమర్శించడం, అవమానించడం మానకపోతే వీరితోపాటు ,సోషల్ మీడియాలో చౌకబారు పోస్టింగులు పెట్టే వారి పైన కూడా చట్టపరంగా చర్యలకు ఉపక్రమించిన తప్పదని వారు హెచ్చరించారు. జమ్మికుంటలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చందా రాజు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి అయిత యుగంధర్ , కౌన్సిలర్లు రావికంటి రాజు, బచ్చు మాధవి శివశంకర్, మద్ది లావణ్య, లతో పాటు ఆర్యవైశ్య మహాసభ హుజురాబాద్ డివిజన్ చైర్మన్ ఏ రాజేంద్రప్రసాద్. కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు యాద సతీష్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు అయితా మహేష్ ,టిఆర్ఎస్ పార్టీ జమ్మికుంట అర్బన్ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, ఆర్యవైశ్య సంఘాల నాయకులు ఆకినపల్లి మురళి, జి రాజమౌళి, బాదం రమేష్, సిహెచ్ శ్రీమన్నారాయణ ముక్క శ్రీనివాస్,శీల జయప్రకాశ్, రామిని మనోహర్, చిదురాల భాస్కర్ లతోపాటు వంద మందికి పైగా ఆర్యవైశ్యులు పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page