Bathukamma saree distribution program organized in Gopinagar Colony
గోపినగర్ కాలనీలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరలపంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి డివిజన్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అన్ని పండుగలను ఘనంగా జరుపుకునేలా చేస్తూ, బతకమ్మ పండగ, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపినగర్ కాలనీలో ఏర్పాటుచేసిన బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆటపాటల కోలాహాలంతో ఆనందాన్ని పంచే ఆధ్యాత్మిక వేడుక బతకమ్మ పండగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం తరఫున 18 సంవత్సరాలు నిండిన మహిళలకు బతుకమ్మ పండుగ చిరు కానుకగా చీరలను పంపిణీ చేస్తుందన్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వందేనని అన్నారు. సమాజంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబింపచేస్తాయని, ప్రకృతితో మమేకమైన పండగ బతుకమ్మ పండుగ అని అన్నారు.
తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగను మహిళలు సమిష్టిగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ బతకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్