authority-to-prevent-the-spread-of-dengue-disease
సాక్షిత : డెంగీ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు అధికార యంత్రాంగం పకడ్బంగీ ఏర్పాట్లు జరపాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు.
జీ హెచ్ ఎం సీ మలేరియా విభాగం సిబ్బందికి అందించే పీ పీ ఈ కిట్లు, వ్యక్తిగత సురక్షిత కిట్లను సికింద్రాబాద్ సర్కిల్ సిబ్బందికి పద్మారావు గౌడ్ బుధవారం సితాఫలమండీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు తాము అధిక ప్రాముఖ్యతను కల్పిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మలేరియా వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను శ్రీ పద్మారావు గౌడ్ ఆదేశించారు. డిప్యూటీ కమీషనర్ దశరద్, ఏంటో మాలజి విభాగం అధికారి శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస్, అధికారులు, నేతలు పాల్గొన్నారు