SAKSHITHA NEWS

సాక్షిత,:చందానగర్ సర్కిల్ కార్యాలయంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ ,మియాపూర్, హఫీజ్పెట్ , చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 5 స్వచ్ ఆటోలను డీసీ సుధాంష్ , AMOH డాక్టర్ కార్తిక్ , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించి, లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ స్వచ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ లో భాగంగా చెత్త సేకరణ కొరకై చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ ,మియాపూర్, హఫీజ్పెట్ , చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 5 స్వచ్ ఆటోలను లబ్ధిదారులకు స్వచ్ ఆటోలను అందించడం ఎంతో అభినందనీయమని,లబ్ధిదారులకు జీవనోపాధి లభిస్తుంది అని ,వారి జీవితాల్లో వెలుగు నింపినట్లు ఉంటుంది అని, అదేవిధంగా ఆటోలు కాలనీ లలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి డంప్ యార్డ్ కి తరలిస్తారని, వీధులలో పేరుకుపోయిన చెత్తకుప్పలను కుడా తొలగిస్తారని, స్వచ్ఛ కాలనీ లు గా తీర్చిద్దిదటంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి అని, ప్రతి కాలనీ పరిశుభ్రత పాటించినప్పుడే రోగాలను దరిచేరుకుండా చేయగలమని, అన్ని కాలనీ లు పరిశుభ్రత పాటించినప్పుడే స్వచ్ హైదరాబాద్ స్వచ్ శేరిలింగంపల్లి గా తీర్చిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మన పరిసర ప్రాంతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని,ప్రతి ఇంట్లో చెత్తను తడి చెత్త ,పొడి చెత్తగా వేరు చేసి ఆటో వచ్చినప్పుడు ఆటోవారికి అందివాళ్ళని, ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఈ ఆటోల ను కాలనీలలో సక్రమమైన మార్గం లో ఉపయోగించాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ SRP లు శ్రీనివాస్ రెడ్డి , మహేష్,కనకరాజు ,ప్రసాద్ ,బాలాజీ మరియు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు చింత కింది రవీందర్, వేణు గోపాల్ రెడ్డి ,కాజా, అమిత్, వరలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS