సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ యు. యు. లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. మూడు తరాలుగా యు. యు. లలిత్ కుటుంబం న్యాయవాద వృత్తిలో ఉంది. గతంలో పలు కీలక కేసుల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. భారత్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా యు. యు. లలిత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రముఖమైన కేసులు ఆయన ముందుకు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే రహస్య ఎన్నికల బాండ్లు, మతం ప్రాతిపదికన పౌరసత్వం వంటి ప్రముఖమైన కేసులు యు. యు. లలిత్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.