ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల..
సాక్షిత : మంత్రి పువ్వాడ స్వీయ నేతృత్వంలో నిర్మాణ పనులు పూర్తి..*
▪️ఈ ఏడాది నుండే తరగతులు నిర్వహణకు ఎర్పాటు పూర్తి.
▪️ అతి త్వరలో 150 సీట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాలలో తరగతులు..
▪️ఫలించిన మంత్రి పువ్వాడ సుధీర్ఘ కల..
▪️జిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ..
విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ కు ధీటుగా విద్యా, వైద్యం అందించాలనే దృడసంకల్పంతో విద్యను, వైద్యాన్ని బలోపేతం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఅర్ .
అందులో భాగంగానే ప్రతి సామాన్యుడు ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఆకాంక్షతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు.
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొదటి విడతలో మెడికల్ కళాశాల మంజూరు అయిన నేపథ్యంలో ఆయా కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది.
ముఖ్యమంత్రి కేసీఅర్ అభీష్టం మేరకు జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) ఇప్పటికే ఆమోదం తెలిపింది.
కొత్తగూడెం మెడికల్ కాలేజీలో 150 సీట్లతో వైద్య విద్యను సామాన్యులకు మరింత చేరువ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు రెండు మెడికల్ కళాశాలలు మంజూరు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళాశాల భవనం, ఇతర సముదాయాలు పూర్తి చేసుకున్నారు.
నిబంధనల మేరకు కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్, హాస్టల్ భవనం, నర్సింగ్ అండ్ పారా మెడికల్ సిబ్బంది వంటి సౌకర్యాలను ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కళాశాలలకు, విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు సమకూర్చారు.
మెడికల్ కళాశాల నిర్మాణ పనులలో కృషి చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ చేసి నిరూపించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
గిరిజనులు అత్యధికంగా ఉన్న కొత్తగూడెం జిల్లాకు సైతం మెడికల్ కళాశాల మంజూరు చేసి సామాన్యులకు కూడా వైద్య విద్యను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.