జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పర్యటన…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎస్వి సొసైటీలో గల శ్రీధర లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు పేలి మంటలు ఎగసిపడుతుండటంతో విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించారు. సాల్వెంట్స్ డిస్టిలేషన్ చేసే క్రమంలో కండెన్సర్ ద్వారా ఫ్లాష్ ఫైర్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో 7 మంది కార్మికులకు గాయాలయ్యాయని అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ రెడ్డి, జీడిమెట్ల ఎస్.హెచ్.ఓ.పవన్, ఫైర్ అధికారులు మరియు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, నాయకులు మారయ్య, ఇస్మాయిల్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పర్యటన…
Related Posts
10 వ జోనల్ ఆటల పోటీలకు ముఖ్య అతిథి
SAKSHITHA NEWS 10 వ జోనల్ ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లేల చిన్నారెడ్డి*సాక్షిత వనపర్తి నవంబర్ 11″వనపర్తి జిల్లాగోపాల్ పేట మండలం బుద్ధారం గండిలో ఉన్న బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆరోగ్య…
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని
SAKSHITHA NEWS ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిసాక్షిత వనపర్తి నవంబర్ 11జిల్లా ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి…