SAKSHITHA NEWS

రక్తదానం చేసిన లస్మన్నపల్లి సర్పంచ్ రాములు

సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా

సైదాపూర్ ,స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండలంలోని లస్మన్నపల్లి గ్రామ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అన్నిటికంటే రక్తదానమే మిన్న అని రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రక్తదానం చేయడం దానిపై కొందరికి అపోహలు ఉన్నాయని వాటిని విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం దానం చేయడం వల్ల మనుషులకు ఎలాంటి స్వల్ప, దీర్ఘకాలిక, వ్యాధులు రావని, ప్రధానంగా గుండె జబ్బులు దరిచేరవని,మనం రక్తం ఇచ్చిన వారం రోజుల్లో మళ్లీ కొత్త రక్తం తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఇందిరా, ఆశ కార్యకర్త నిర్మల, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS