ఈనెల 13న జరుగు జాతీయ లోక్ అదాలత్ అను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్ మేడం

Spread the love

ఈనెల 13న జరుగు జాతీయ లోక్ అదాలత్ అను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్ మేడం *
జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page