SAKSHITHA NEWS

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని వెల్ చాల్ గ్రామంలో 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.

◆ పల్లె ప్రగతిలో ఏం చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు, పాడు బడ్డ ఇళ్లను, పిచ్చిమొక్కలను తొలగించాలని, బావులపై పై కప్పులు ఏర్పాటు చేయాలని, గ్రామంలోని శానిటేషన్ సరైన పద్దతిలో చేయాలని, మళ్ళీ శానిటేషన్ సమస్యలు పునరావృతం అయితే చర్యలు తీసుకోబడతాయని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు.

◆ గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంక్ ను కచ్చితంగా శుభ్రం చేయాలని, ఎక్కడ కూడ లీకేజీలు లేకుండా చూసి, ప్రజలకు నీరు అందించాలని, మిషన్ భగీరథ నీటినే త్రాగాలన్నారు.

◆ గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, స్థంభాలకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు పెట్టాలని, గ్రామంలో ఓల్టేజ్ సమస్య ఉన్నందున 25KV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, లైన్ షిఫ్టింగ్ చేసి విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు.

◆ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వాటిని వాడుకలో పెట్టుకోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS