మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిడమర్రు గ్రామంలో డాక్టర్ వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్

Spread the love

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిడమర్రు గ్రామంలో డాక్టర్ వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను స్పెషలాఫీసర్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి , ఎమ్మెల్సీ హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే , కార్పొరేషన్ కమిషనర్ శారదా దేవి , MRO రాంప్రసాద్ ప్రారంభోత్సవం చేశారు…

ఎమ్మెల్యే ఆర్కే కి ఘన స్వాగతం పలికిన నిడమర్రు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, Team RK సభ్యులు…

ముందుగా ఎమ్మెల్యే ఆర్కే నిడమర్రు గ్రామంలో Dr. BR అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి, దివంగతనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం UPHC ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం మురుగుడు హనుమంతరావు చేతుల మీదుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఎర్రబాలెం గ్రామంలో డాక్టర్ వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి ఆయుష్మాన్ భవ పథకం ద్వారా 80 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరియు 65 లక్షల MTMC కార్పొరేషన్ నిధులతో మొత్తం 1 కోటి 45 లక్షల రూపాయలతో కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా 10 పడకల UPHC ని పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మించడం జరిగిందని అన్నారు.

మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 9 డాక్టర్ వైఎస్ఆర్ ప్రైమరీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్మాణం జరుగుతున్నాయని, ఇందులో మొదటిగా కొన్ని రోజుల క్రితం ఎర్రబాలెం గ్రామంలో UPHCని ప్రారంభించుకోవడం జరిగిందని, ఈరోజు నిడమర్రు గ్రామంలో UPHC ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్య అవసరాలకు ఈ ఆసుపత్రి ఎంతో దగ్గరగా సకల సౌకర్యాలతో అందుబాటులో ఉంటుందని, ఒక రెండు రోజుల లోనే వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తి టెక్నాలజీ పరికరాలతో వైద్య సేవలు ప్రారంభించనున్నారని అన్నారు.

ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి సహకరించినటువంటి స్పెషల్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ కి ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, నిడమర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్లి శేషిరెడ్డి, సాగర్ రెడ్డి, సుందర రెడ్డి, నాగిరెడ్డి మాస్టర్, మునగాల మల్లేశ్వరావు, మండేపూడి బుజ్జి, మండేపూడి నాగరాజు, సంకా బాలాజీ గుప్తా, నేరెళ్ల మురళి, ఈదులమూడి డేవిడ్రాజు, కొండూరు ముత్తయ్య, దాసరి వీరయ్య, దానబోయిన వెంకటేశ్వరావు, ఫిరోజ్, ఆదామ్, హన్నన్, తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page