కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి భేటీ

SAKSHITHA NEWS

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి భేటీ
తిరుపతి నియోజక వర్గ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

సాక్షిత : ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖా మంత్రితో భేటీ అయిన తిరుపతి ఎంపీ తిరుపతి పార్లమెంట్ పరిధిలో రహదారుల అభివృద్ధి గూర్చి ఆయనకు వివరించారు. పలు కొత్త రహదారుల నిర్మించాల్సిన ఆవశ్యకత గూర్చి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పూతలపట్టు నుండి నాయుడుపేట వరకు 6 లేన్ల గా విస్తరింపబడుతున్న జాతీయ రహదారి – 71 లో రామానుజపల్లి కూడలి, అవిలాల క్రాస్, తనపల్లి క్రాస్, దగ్గర నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుందని చుట్టూ పక్కల గ్రామాల నుండి తమ వ్యవసాయ ఉత్పత్తులని ఈ మార్గాల ద్వారా తిరుపతి పట్టణానికి చేరవేస్తారని అలాగే నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు ఈ మార్గాల ద్వారా ప్రయాణిస్తారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రేణిగుంట మండలం కురకాల్వ దగ్గర స్విమ్స్ కి కేటాయింపబడిన స్థలం ఉండటంతో అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్దమయ్యాయని పైన మూడు ప్రదేశాలలో రోడ్డు కమ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయాలనీ విన్నవించారు. ఈ రహదారి తిరుపతి పార్లమెంట్ పరిధిలో 57 కి.మి గా ఉందని ఇందులో వివిధ ప్రదేశాలలో 29 కి.మి కు మాత్రమే సర్వీస్ రోడ్ మంజూరు అయ్యిందని ఈ జాతీయ రహదారిలో భారీ ట్రాఫిక్ ఉండడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మించిన యెడల ప్రమాదాలు నివారించవచ్చని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నాయుడుపేట నుండి అంటే పండ్లూరు, పున్నేపల్లి, కరబల్లవోలు, మనవలి, సగుటూరు గ్రామాలకు వెళ్లే మార్గంలో శిధిలావస్థలో ఉన్న వంతెన అప్ గ్రేడేషన్ కోసం 46 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయడం జరిగినదని చెప్పారు ఈ వంతెన పూర్తయితే సంబంధిత గ్రామాల ప్రజలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు.

వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో గొడ్డేరు నదిపై నాయుడుపేట నుండి రాపూరు రోడ్ లో 39/4 కి.మీ దగ్గర రూ.5.75 కోట్లతో, వెంకటగిరి నుండి కోడూరు రోడ్ లో గొడ్డేరు నదిపై 7/2 కి.మీ దగ్గర రూ.6.55 కోట్లతో, వెంకటగిరి నుండి కుర్జగుంట రోడ్ లో 3/6 కి.మీ దగ్గర కైవల్య నదిపై రూ.5.3 కోట్లతో, వెంకటగిరి నుండి మోపూరు రోడ్ లో 3/6 కి.మీ దగ్గర గొడ్డేరు నదిపై రూ.5.25 కోట్లతో, బంగారుపేట మీదుగా హస్తకావేరి, నిదిగాళ్లు వెళ్లే మార్గంలో 4 /10 కి.మీ దగ్గర స్థానిక వాగుపై రూ.2.97 కోట్లతో, నిండలి,దగ్గవోలు, పాతనాలపాడు రోడ్డు కి.మీ.0/ 10 వద్ద కైవల్య నదిపై రూ.7.5 కోట్లతో నిండలి వెళ్లే మార్గంలో కైవల్య నదిపై 0/10 కి.మీ దగ్గర 6.98 కోట్లతో సిఆర్ఐఎఫ్ నిధులతో ఆర్&బి రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలియజేసారు.
తమిళనాడులోని పలు ప్రాతాలనుంచి ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీకాళహస్తి పట్టణానికి అనునిత్యం వేలసంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారని, ఈ ప్రాంతంలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడ వలన తడ నుంచి శ్రీకాళహస్తి మీదుగా భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయని ఈ రోడ్డు ప్రమాదకరమైన మలుపులతో ఉంటుందని ఈ రహదారిపై గతంలో కంటే రద్దీ రెట్టింపు అయ్యిందని ట్రాఫిక్ తీవ్రత ఎక్కువైందని ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి త్వరితగతిన రహదారిని విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్దించడం జరిగిందని తెలియజేసారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల గూర్చి కూడా ఆయనకు ప్రతిపాదనలు సమర్పించామని అందుకు మంత్రి నితిన్ఎం గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.


SAKSHITHA NEWS

Related Posts

rahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ…


SAKSHITHA NEWS

world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSworld ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page