
మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ITC చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ప్రారంభించిన మంత్రి సీతక్క…
సాక్షిత : చెత్తను నిర్మూలించడంలో భాగంగా చెత్తను సేకరించి, సెగ్రిగేషన్ చేసి దుర్వాసనను అరికట్టి శుద్దిచేసేందుకు పీర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ఏర్పాటు చేశారు..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…
ఇలాంటి కార్యక్రమం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టడం శుభ పరిమాణం అని, ఇదే విధంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలన్నారు…
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా చొరవ తీసుకుంటానని మంత్రి సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల మేయర్లు అమర్ సింగ్, తోటకూర అజయ్ యాదవ్, టిపీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
