SAKSHITHA NEWS

రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం ప్రారంభం

కమిటీ చైర్మన్ గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచిరేవులలోని ఆయన నివాసంలో సమావేశం.. హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,సత్యవతి రాథోడ్

కమిటీ సభ్యులు గా మాజీ మంత్రులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ , పువ్వాడ అజయ్ , జోగు రామన్న , బాజిరెడ్డి గోవర్ధన్ , అంజయ్య యాదవ్ , రసమయి బాలకిషన్ , యాదవ రెడ్డి తదితరులు

జనవరి 24 నుండి ఫిబ్రవరి చివరివారం వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించి రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా మోసం, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకొని ఒక నివేదిక తయారు చేస్తామని సత్యవతి రాథోడ్ గారు తెలిపారు