కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తాడిపర్తి బిఆర్ఎస్ యువ నాయకులు
సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన 35 మంది యువకులు వంశీకృష్ణ, సమక్షంలో లోకా రెడ్డి, చంద్రయ్య ల ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరార
వీరికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో యువతకు ఎక్కడ న్యాయం జరగలేదని యువకులు హమాలీ పని చేసుకుని జీవించాల్సిన కర్మ పట్టిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువకులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తుందని దాంతో పార్టీ పథకాలకు ఆకర్షితులమై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్క యువకుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో పనిచేయాలని ప్రతి ఒక్కరిని తాను గుండెల్లో పెట్టి చూసుకుంటాననిఎమ్మెల్యే పేర్కొన్నారు
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్య శీలా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు