SAKSHITHA NEWS

రంపచోడవరం జనసైనికులకు ఎల్లవేళలా అండగా ఉంటా…. ఎమ్మెల్యే బత్తుల

పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం జనశ్రేణులు మరింత నిబద్దతతో పనిచేయాలని దశా దిశా నిర్దేశం

సమన్వయంతో కూటమి లక్ష్యం కోసం ముందుకు వెళ్ళాలి

ఈ సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తా..

అడవి బిడ్డలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, పవన్ కళ్యాణ్ కూడా మీ కోసం మీ ఉన్నతి కోసం పరితపిస్తున్నారు..

అభిమానంతో తరలివచ్చిన రంపచోడవరం నియోజకవర్గ జనసైనికులతో బత్తుల మాటా మంతి

పలు సమస్యలపై కూలంకుషంగా సమాధానాలు వెలుబుచ్చిన ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ని వారి స్వగృహం నందు జనసేన పార్టీకి NDA కూటమికి సమాజసేవకు ఎనలేని సేవలందిస్తున్న ఎమ్మెల్యే బత్తుల పై అభిమానంతో సుదూర ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం నుండి సుమారు 100 మంది జనసైనికులు ఎమ్మెల్యే బత్తులను కలిసి జనసేన పార్టీ తో వారి అనుభవాన్ని, అనుబంధాన్ని వెలుబుచ్చారు. ఈ సందర్భంగా జనశ్రేణులు వెలుబుచ్చిన పలు సమస్యలను శ్రద్ధగా విని సాధ్యమైనంత మేరకు జనసేన పార్టీ అభివృద్ధికి NDA కూటమి లక్ష్యాలకు పవన్ కళ్యాణ్ ఆశయం కోసం మీకు అన్ని విధాలా అండగా ఉంటానని మీకు ఏ కష్టం వచ్చినా తెలియపరిస్తే స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని అలానే అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ నియోజకవర్గ స్థితిగతులను తీసుకువెళ్తానని మాట్లాడుతూ మీలోని ఉత్సాహం మీలోని యువశక్తి మీలోని తెగింపు మీలోని సేవాగుణం నన్ను ఎంతగానో ఉత్సాహపరచాయని మీలాంటి యువత స్పూర్తితో జనసేన పార్టీ మరియు NDA కూటమి ముందుకు సమన్వయంతో సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లి ఉన్నత లక్ష్యాలను చేరుకుందామని , త్వరలో రంపచోడవరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే తో పర్యటించి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ సమన్వయ పరుస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ నాపై ఇంత అభిమానాన్ని కురిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..

ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు , జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS