PEPOLE ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం – ఎంపీడీఓ గుండె బాబు
- గ్రామాలల్లో పారిశుధ్యం పై కార్యదర్శులు శ్రద్ధ వహించాలి
……………………………………………………………………….
సాక్షిత కమలాపూర్
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని భీంపల్లి గ్రామం లో ప్రజలకు వైరల్ జ్వరాలు వస్తున్న విషయం తెలుసుకొని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు మరియు మెడకల్ ఆఫీసర్ పద్మశ్రీ కలిసి గ్రామంలోని తొమ్మిదో వార్డులో ప్రతి ఇల్లు తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గుండె బాబు మాట్లాడుతూ భీంపల్లి గ్రామ మెడికల్ ఆఫీసర్ రేణుక మరియు ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్లు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా వార్డులోని ప్రతి కుటుంబాన్ని పరిశీలించి వారికి సరైన వైద్య సహాయం అందించవలసిందిగా ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా గ్రామపంచాయతీ సిబ్బందితో గ్రామంలో పారిశుద్ధ్యము సక్రమంగా నిర్వహించాలని ఎప్పటికప్పుడు రోడ్లు ,డ్రైనేజీలు, శుభ్రం చేయాలని గ్రామంలోని ప్రతి వాడలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అన్నారు. మండల వైద్యాధికారులు కూడా ప్రతి గ్రామంలో డెంగ్యూ ,మలేరియా ,లాంటి వ్యాధులు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పిహెచ్సి వైద్యాధికారి పద్మశ్రీ, భీంపల్లి వైద్యాధికారి రేణుక, పంచాయతీ కార్యదర్శి సృజన, మాజీ సర్పంచ్ పద్మా కుమారస్వామి, గ్రామపంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు ,మరియు ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.