SAKSHITHA NEWS

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం

రైతులు, ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10 వేల మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటాం. లేదంటే పోరాటానికి వెనుకాడం

అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి స్పష్టం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కంటైనర్ టెర్మినల్ తరలిపోలేదని నోటికొచ్చినట్టు నన్ను తిట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి కళ్లు కనిపించకపోతే కంటి డాక్టరుకు చూపించి చుక్కల మందు వేయిస్తామన్న సోమిరెడ్డి

టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ నాయకులతో కలిసి పోర్టు సీఈఓ జీజేరావు, పీఆర్వో వేణుగోపాల్ తో భేటీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కంటైనర్ టెర్మినల్ ఆవశ్యకతతో పాటు ఇతర సమస్యలను ప్రస్తావించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సీపీఐ నేత శంకర్ తదితరులు

టెర్మినల్ పునరుద్ధరణతో పాటు కూలీలకు కూలి పెంపు, ఉద్యోగుల వేతనాలు, పట్ట కట్టే కూలీల పెంపు తదితర అంశాలపై చర్చించిన సోమిరెడ్డి

పోర్టు ప్రతినిధులతో సమావేశం అనంతరం కంటైనర్ టెర్మినల్ యార్డును పరిశీలించిన సోమిరెడ్డి, బీజేపీ, జనసేన, సీపీఐ నాయకులు

కార్యకలాపాలు లేక బోసిపోతున్న టెర్మినల్ తో పాటు ఖాళీ కంటైనర్లను చూసి ఆవేదన వ్యక్తం చేసిన సోమిరెడ్డి

మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్

కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పునరుద్దరణే మా లక్ష్యం

రైతులకు సంబంధించిన రొయ్యలు, చేపలు, మిర్చి, పొగాకుతో పాటు గ్రానైట్ తదితర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి

తమిళనాడులోని పోర్టులకు ఆ ఉత్పత్తులను తరలించేందుకు రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు తగ్గి ఆ నష్టప్రభావం కూడా రైతులపైనే పడుతోంది

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించిన రైతుల ఉత్పత్తుల ఎగుమతులను కిల్ చేసేశారు.

కంటైనర్ టెర్మినల్ ను తరలించేసి దుమ్ముతో కూడిన ఐరన్ ఓర్, బొగ్గును మన ముఖాన కొట్టారు

ఏపి మారిటైం బోర్డు పర్యవేక్షణలో ఉన్న పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోతున్నా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలేదు

2019కి ముందు సీవీరావు పెత్తనంలో 10 లక్షల కంటైనర్ల ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది

సుమారు 12 వేల మంది పోర్టులోని కంటైనర్ టెర్మినల్ పై ఆధారపడి జీవనం సాగించారు

ఇప్పుడు ఆ ఉద్యోగాలు పోయాయి. ఆదాయం కూడా లేకుండాపోయింది

పోర్టు కోసం తాతముత్తాతలు ఇచ్చిన ఇళ్లు, భూములు, పొలాలను త్యాగం చేస్తే చివరకి దుమ్ము, దూళి మాత్రమే మిగిలాయి

సీవీ రావు హయాంలోనే 10 లక్షల కంటైనర్ల ట్రాన్స్ పోర్టు జరిగితే, ఇక అదానీ చేతికొచ్చింది కాబట్టి 20 లక్షల కంటైనర్లకు పోతుందని భావించాం.

కానీ పోర్టు ఇలా మునిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు.

వైజాగ్, ముంబై, చెన్నై పోర్టులతో పోటీపడిన కృష్ణపట్నం పోర్టుకు ఈ పరిస్థితి రావడం జీర్ణించుకోలేకపోతున్నాం

వేలాది రూపాయలు జీతాలతో ఉపాధి పొందిన ఈ ప్రాంత యువత ఈ రోజు కూలికిపోయే పరిస్థితి రావడం భరించలేకున్నాం

కంటైనర్ టెర్మినల్ మూసేసారయ్యా..అని జనవరి నుంచే మేం ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు పోరాటం సాగిస్తూనే ఉన్నాం

ఆనాటి మంత్రి కాకాణి పోర్టుకు వచ్చి కంటైనర్ టెర్మినల్ మూతపడలేదని, సోమిరెడ్డికి కళ్లు పోయాయని నోటికొచ్చినట్టు మాట్లాడాడు

ఇప్పుడైనా వచ్చి కంటైనర్ టెర్మినల్ చూడమనండి. కళ్లు కనిపించకపోతే డాక్టర్ కు చూపించి చుక్కలు మందు వేయిస్తాం

కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ టోలుగేటు తెరవడం, దౌర్జన్యాలు చేయడం తదితర కారణాలతోనే అదానీకి వళ్లు మండి టెర్మినల్ ను తమిళనాడుకు తరలించేశారు

ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన అదానీకి ఈ పోర్టు టెర్మినల్ ను కొనసాగించడం చాలా చిన్నవిషయం

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ సాయం కావాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభ్యర్థించి అందిస్తాం

బీజేపీ, జనసేనతో పాటు ఇతర పక్షాలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తాం

ఎప్పుడు, ఎక్కడ అవకాశం ఇచ్చినా అప్పుడు అక్కడ అదానీని కలిసి మా గోడు వినిపిస్తాం.

గతంలో పోర్టు నిర్వాసిత రైతులకు పరిహారం పెంచేందుకు కూడా ప్రత్యేక బస్సులు వేసుకెళ్లి ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలను కలిశాం..సమస్యలకు పరిష్కారాలు సాధించాం

రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం కానీ…పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం ఏనాడు ఒక మెట్టు దిగలేదు

కానీ పోర్టును నమ్ముకున్న మా ప్రాంత ప్రజలు, రైతులు, ఉద్యోగాలు కోల్పోయిన యువత కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం

కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టులో పునరుద్ధరించకపోతే ఏ పోరాటానికైనా సిద్ధం..ప్రాణాలిచ్చేందుకు కూడా వెనుకాడం

మంచి మనస్సు చేసుకుని పోర్టులో కంపెనీలన్నీ కార్యకలాపాలు తిరిగి కొనసాగించి పోర్టుకు పూర్వవైభవం తేవాలని కోరుతున్నాం

పోర్టులో సుమారు 1000 మంది మహిళలు రోజుకు 9 గంటల పాటు కూలి పనిచేస్తున్నారు

వారికి రోజుకు రూ.250 కూలి ఇస్తున్నారు. అందులో రూ.50 చార్జీలకు పోతే వారికి మిగులుతోంది రూ.200 మాత్రమే

కూలీలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి కనీసం రూ.350 కూలి చెల్లించాలని కూడా పోర్టు సీఈఓకు విన్నవించాం

ట్రక్కులకు పట్ట కప్పే వారికి రూ.150 ఇవ్వాలని, డైనింగ్ హాల్ తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారికి జీతాలు కనీస వేతన చట్టం ప్రకారం పెంచాలని కోరాం.

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం

SAKSHITHA NEWS