SAKSHITHA NEWS

Key announcement on free electricity
ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన
ఉచిత వ్యవసాయ విద్యుత్తుపై ఏపీ మంత్రి
గొట్టిపాటి కీలక ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్
సరఫరా కోసం పటిష్ట చర్యలు
తీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారుల
ఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం
ఇవ్వాలని డిస్కంలకు సూచించారు. వర్షాల వల్ల
దెబ్బతిన్న విద్యుత్ స్థంబాలు, లూజుగా ఉన్న
లైన్లు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల
విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి
ఆదేశించారు.

SAKSHITHA NEWS