కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌..

SAKSHITHA NEWS

International kidney racket exposed in Kerala..

కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌..

; ప్రధాని సూత్రధారి హైదరాబాద్ డాక్టర్ !

హైదరాబాద్‌ కేంద్రంగా నుంఇరాన్, వయా కేరళ ఈ దంద నడుస్తోంది. పేద యువకులకు డబ్బు ఆశ చూపి 40 మంది కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేశారు. అయితే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో విషయం బయటపడింది.

కేరళలో వెలుగు చూసిన ఈ భాగోతానికి ముఠా మాస్టర్‌ హైదరాబాద్‌కు చెందిన వైద్యుడుగా గుర్తించారు పోలీసులు. కేరళతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ అవయవ రవాణా రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.

త్రిస్సూర్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి కొచ్చిలో మరొకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత గత రెండు రోజుల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ వెలుగుచూసింది. డబ్బు అవసరం ఉన్న యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు.

ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి, రూ.6 లక్షలు ముట్టజెబుతున్నారు. డోనర్లు ఇరాన్‌ వెళ్లేందుకు కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూరుస్తున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు నుంచి డోనర్లు ఇరాన్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అవయవ సేకరణ కోసం భారతదేశం నుండి 20 మందిని ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు సుబిత్ పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. కిడ్నీ మార్పిడి కోసం భారతదేశం నుండి అక్రమంగా ప్రజలను రిక్రూట్ చేసే రాకెట్‌లో తాను భాగమని సబిత్ పోలీసులకు చెప్పాడు.

హైదరాబాద్, బెంగళూరుకు చెందిన యువకులను ఇరాన్‌లో కిడ్నీ దాతలుగా నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ రాకెట్‌లో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఢిల్లీకి చెందిన వ్యక్తికి కిడ్నీ దానానికి సంబంధించి మొదట హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను అవయవ వ్యాపారంలోకి తీసుకున్న ఇతరులను కలిశానని సబిత్ పోలీసులకు చెప్పాడు.

ఈ అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నకిలీ ఆధార్ మరియు ఇతర గుర్తింపు కార్డులతో కేరళకు చేరుకున్న కొంతమంది వలస కార్మికులను అవయవ లావాదేవీల కోసం సబిత్ ఇరాన్‌కు రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు NIA రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన FIR ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో ఇద్దరి కోసం గాలిస్తుంది.

WhatsApp Image 2024 05 24 at 12.34.14

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyouth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు…


SAKSHITHA NEWS

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSgodavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page