Before the countఎన్నికల ఫలితాలు వెల్లడించేసమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!!
1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి.
ఈ ఫారం 17సీ ఏజెంట్లు సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లు భావించాలి.
2) ప్రతి పోలింగ్ కేంద్రం (Polling Station) ఫారం 17సీ లో వున్న కంట్రోల్ యూనిట్ (C.U No) నెంబరు, మిషన్ పైన వున్న నెంబరు సరిచూసుకోవాలి. పోలింగ్ రోజున ఏదైనా సమస్య వచ్చినప్పుడు సీ.యు (కంట్రోల్ యూనిట్) మార్చినా అది ఫారం 17 సీ మార్చినట్లు చూపించివుండాలి. ఒక వేళ ఆ నెంబరు మ్యాచ్ కాకపోతే కౌంటింగ్ ఆపి ఆర్.ఓ గారితో సంప్రదించి కౌంటింగ్ ప్రారంభించాలి.
3) ఫారం 17సీ లో నమోదైన ఓట్ల సంఖ్య మరియు సీ.యు (కంట్రోల్ యూనిట్)లో చూపిస్తున్న ఓట్ల సంఖ్య సమానంగా వుండాలి. ఒక వేళ లేక పోతే రిటర్నింగ్ అధికారి అడిగి నివృత్తి చేసుకొన్న తర్వాత రిజల్ట్ కౌంటింగ్ ప్రారంభించాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రెవెన్యూ వారు ప్రిసైడింగ్ అధికారులకు సరైన శిక్షణ లేని కారణంగా కొంత మంది ప్రిసైడింగ్ అధికారులకు సీ.ఆర్.సీ గురించి (Close Result Clear) అర్ధం కాక పోవడం వల్ల కొంత సమస్య వచ్చింది. వాస్తవంగా ఏజెంట్లు సమక్షంలో మాక్-పోల్ జరిపి అందులో వున్న ఓట్లను సీ.ఆర్.సీ (Close Result Clear) చేసి వాస్తవ ఎన్నిక జరగాలి. ఒక వేళ సీ.ఆర్.సీ చేయని సందర్భంలో మాక్-పోల్ చేసిన ఓట్లను వి.వి.పాట్ నుండి వేరు చేసి సీల్డ్ కవర్ (వైట్ బాక్స్)లో వుంచిన వాటిని లెక్కించి, సీ.యులో వాస్తవంగా పోల్ అయిన గ్రాస్ ఓట్ల నుండి తీసివేసి నికరంగా వచ్చిన ఓట్లను తుది ఓట్లుగా పరిగణించాలి.
4) కంట్రోల్ యూనిట్ కు వున్న అన్ని సీళ్ళను ఫారం 17సీ లో వున్న నెంబర్లతో సరిగా వున్నాయా లేదా ఖచ్చితంగా సరిచూసుకోవాలి.
5) మిషన్ పైన సీళ్ళు ఏవైనా చిరిగివున్నాయా లేదా సరిగ్గా వున్నాయా? తనఖీ చేసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన అంశం.
6) కంట్రోల్ యూనిట్ (CU)పైన అన్ని సీళ్ళ పైన ఏజెంట్లు మరియు అధికారుల సంతకాలు వుంటాయి, అవి సరిగ్గా వున్నాయా లేదా సరిచూసుకోవాలి. అనుమానం వస్తే నివృత్తి చేసుకొన్న తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలి.
7) పోలింగ్ సమయంలో ఏదైనా పోలింగ్ కేంద్రంలో సాంకేతిక కారణాలతో మరో మిషన్ వాడివుంటే, వాటి వివరాలు కూడా ఫారం 17సీ నమోదు చేసి వాటి వివరాలు కూడా సరి చూసుకోవాలి.
అతి ముఖ్యమైన విషయం రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత గుర్తించ వలసిన క్రింద అంశాలు.
మీ నియోజకవర్గంలో నోటాతో కలిపి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను చూపించాలి.
9) పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల సంఖ్య 17సీలో పోలైన ఓట్లతో సమానంగా వుండాలి.
10) కంట్రోల్ యూనిట్ లో పోలింగ్ తేది, పోలింగ్ ప్రారంభం సమయం మరియు పోలింగ్ ముగింపు సమయం గంటలు మరియు సెకన్లతో సహా చూపిస్తుంది, వాటిని సరిచూసుకోవాలి.
11) పైన తెలిపిన అన్ని విషయాలపైన మీరు సంతృప్తి చెందినట్లు అయితేనే ప్రతి రౌండ్ లో మీరు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సంసిద్ధత తెలపాలి...ing starts
కౌంటింగ్ ప్రారంభమానికి ముందు
Related Posts
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు SAKSHITHA NEWS
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
SAKSHITHA NEWS మహబూబ్ నగర్ జిల్లా: మాగనూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన వికరించి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా,తీసుకున్నారు ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా…