BRS Party stands by the activists
జగిత్యాల పట్టణ 32వ వార్డు భీష్మ నగర్ కి చెందిన మత్స్య కార్మికుడు,బి అర్ ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వర్షాకాలం లో చేపల వేట కు వెళ్లి వరద లో చిక్కుకొని మరణించగా బి అర్ ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కును బి అర్ ఎస్ పార్టీ కార్యలయం మోతే రోడ్డు లో వారి భార్య కొండ్ర జమున, కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ
పార్టీ సభ్యత్వం కలిగిన బిఆర్ ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది
కార్యకర్తలకు అండగా నిలుస్తున్న పార్టీ బిఆరెస్ పార్టీ అని,రాష్ట్రం లో 60 లక్షల పైచిలుకు మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని,జగిత్యాల నియోజకవర్గ లో 50 వేల మంది పైగా సభ్యత్వం తీసుకున్నారు అని అన్నారు.
బలమైన కార్యకర్తలు గల పార్టీ బిఆరెస్ పార్టీ అని అన్నారు.
బి అర్ ఎస్ పార్టీ ప్రమాద భీమా సభ్యత్వము ఉండడం వల్ల వారి కుటుంబానికి 2 లక్షలు అందజేయటం జరిగింది అని కుటుంబానికి కొంత ఆర్థికంగా భరోసా గా ఉంటుంది అని అన్నారు.
ఇప్పటి వరకు 25 మందికి పైగా ఇన్స్యూరెన్స్ చెక్కులు అందజేయటం జరిగింది అని అన్నారు…
బి అర్ ఎస్ పార్టీ చురుకైన కార్యకర్త నీ కోల్పోవడం భాధాకరం అని అన్నారు.
కొంద్ర జమున కి వారి కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ పార్టీ పరంగా అండగా ఉంటామని అన్నారు..
మత్స్య కార్మికుల వృత్తి చాలా సాహసోపేతం తో కూడుకున్నది అని అన్నారు…
మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు..
మిషన్ కాకతీయ,ఉచిత చేప పిల్లల పంపిణీ,లైవ్ జాకెట్లు,వ్యాన్ లు, మోపెడ్ లు ఇవ్వడం జరిగింది అని,చెరువులకు హద్దులు సైతం గుర్తించడం జరిగింది అని అన్నారు.కుల వృత్తులు,సంఘాల అభివృద్ధికి నిదులు కేటాయింపు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులకు కొండ్రా జమున విద్యాసాగర్ కుటుంబ పక్షాన ధన్యావాదాలు అని అన్నారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోరే గంగమల్లు,సంఘం అధ్యక్షులు శంకర్,మోతే మాజీ సర్పంచ్ జుంభర్తీ శంకర్,
మాజీ కార్యదర్శి నర్సయ్య,వార్డు యూత్ అధ్యక్షులు బింగి శేఖర్,నాయకులు
లింగారెడ్డి,సిరికొండ మహేష్,రాజేష్,రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.