హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ రోడ్ నంబర్ 2, 3, 4, 5, లలో చేపట్టనున్న యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
సాక్షిత : కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, యూజీడీ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అదేవిధంగా ప్రజల సహకారంతో హైదర్ నగర్ డివిజన్ లో నూరు శాతం సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు పూర్తి చేస్తామని అన్నారు. డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నక్క శ్రీనివాస్, సత్యనారాయణ, రాజీ రెడ్డి, చాట్ల రవి, చంద్రయ్య, రాఘవేందర్ రెడ్డి, అంజి రెడ్డి, నరేందర్ రెడ్డి, దేవేందర్, ఎల్ల స్వామి, పీరయ్య, నాగార్జున రెడ్డి, బ్రహ్మయ్య, చంద్ర రెడ్డి, నాయుడు, రాఘవేందర్ రావు, నరసింహ రెడ్డి, శ్రీశైలం, రాం చందర్, బాలకృష్ణ, నరేష్ మరియు మహిళలు విమల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.