మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో డ్రైడే నిర్వహణలో భాగంగా మొక్కలకు అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి నీరు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం సమతుల్యం గా ఉండాలన్న, వర్షాలు పడాలన్న మొక్కల సంరక్షణ చేపట్టాలని సూచించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అలాగే నర్సరీలలో మొక్కలకు ఎండ తీవ్రత దృష్ట్యా తరుచుగా నీటిని అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
Related Posts
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో పిటిషన్
SAKSHITHA NEWS హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో పిటిషన్ లగచర్ల ఘటనలో మూడు కేసుల నమోదు చేసి.. మూడు FIR లు చేశారంటూ పిటిషన్ ఒకే ఘటనలో 3 FIR లు ఎలా చేస్తారంటూ.. ప్రభుత్వ లాయర్‌ను…
హైదరాబాద్: ముగిసిన రాష్ట్రపతి ముర్ము
SAKSHITHA NEWS హైదరాబాద్: ముగిసిన రాష్ట్రపతి ముర్ము తెలంగాణ పర్యటన.. SAKSHITHA NEWS