SAKSHITHA NEWS

చింతపల్లి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పిఆర్కే తల్లి రాములమ్మ, సోదరి నాగమణి

షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడి
సంక్షేమ ఫలాలను ప్రతి పేదవాడికి అందజేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కుతుందని మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి అన్నారు. శనివారం మాచర్ల నియోజకవర్గ పరిధిలోని కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి నియోజకవర్గన్ని అభివృద్ధి పద్ధంలో నడిపించిన వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ని ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

ఓటర్లు మరలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వాదిస్తే ప్రతిఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరలా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వారు కోరారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా కొడుకు గెలుపు కోసం తల్లి అన్న గెలుపు కోసం చెల్లి ప్రచారం నిర్వహిస్తుండటంతో గ్రామ ప్రజల నుండి వారికీ మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో చింతపల్లి వైసీపీ నాయకులు పంగుళూరి. రామకృష్ణయ్య, ఎంపీపి బొమ్మిన. సావిత్రి అల్లయ్య, జడ్పీటీసీ షఫీ, దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ము. చంద్రశేఖర్, యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, కారంపూడి మండల వైసీపీ ఎన్నికల ఇంచార్జి దోర్నాల. సాంబిరెడ్డి, మిరియాల వైసీపీ నాయకులు కొమ్మిరెడ్డి. ఎర్రగురువారెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు కొంగర. సుబ్రహ్మణ్యం, పాతూరి. రామిరెడ్డి, ఎంపీటీసీ వేముల. లింగయ్య, సచివాలయ కన్వినర్ అల్లు. వెంకటేశ్వరరెడ్డి, చింతపల్లి వైసీపీ నాయకులు ఉన్నం. నాగేశ్వరరావు, సురే. చెంచారావు, సురే. శ్రీనివాసరావు, సురే. వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ టీ. అచ్చుతరావు, అమరయ్య, మోషే, ఉన్నం. మల్లయ్య, పేరుపోగు. రత్నం, పాలేపోగు. దాసు, మైనారిటీ నాయకులు మీరా, సోషల్ మీడియా కన్వినర్ జక్కిరెడ్డి. నాగిరెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 03 at 2.37.01 PM

SAKSHITHA NEWS