అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీ గ్లాసులను ప్రచారానికి వాడుకుంటున్నారు. కాగితపు టీ కప్పుపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల చిత్రాలు, పార్టీ గుర్తు ముద్రించి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు అనుచరులు మంగళ, బుధవారాల్లో సత్తెనపల్లిలో తొలివిడతగా సుమారు 70 టీ దుకాణాలకు 200 చొప్పున టీ కప్పులను ఉచితంగా అందజేశారు. కొందరు వాటిని తీసుకోబోమంటే.. ఒత్తిడి చేసి మరీ ఇచ్చారు. దీనిపై తెదేపా నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మొత్తానికి దుకాణాల్లో తనిఖీలు చేసి కొన్ని టీ కప్పులను స్వాధీనం చేసుకున్నారు….
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడం
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…