అధైర్యపడొద్దు అండగా ఉంటా : నామ
………
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
కామేపల్లి మండలం పండితాపురం కొట్లాట కేసుకు సంబందించిన కేసులో ఖమ్మం జిల్లా జైలు లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను మంగళవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు , మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,జిల్లా నాయకులు జీవన్ జైలులో పరామర్శించారు .ఈ సందర్భంగా ఎంపీ నామ జైలు లోపలికి వెళ్లి, బాధిత పార్టీ కార్యకర్తలు ధనేకుల హన్మంత రావు, ధనేకుల మాధవరావు, చల్లా హరి, చల్లా నాగేంద్ర బాబు, చల్లా నరేష్ లను ములాఖత్ లో కలిసి,మాట్లాడి, దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యకర్తలను పార్టీ కన్న బిడ్డల్లా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని నామ ఈ సందర్భంగా అన్నారు.
కార్యకర్తలే పార్టీకి రథసారధులు, దిశా నిర్దేశకులని, వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉండి కాపాడుకుంటామని, .అధైర్యపడాల్సిన పని లేదని పేర్కొన్నారు.కార్యకర్తలే పార్టీకి పట్టుగోమ్మలని అన్నారు.అక్కడే ఉన్న కామేపల్లి మండల నాయకులు తోను, బాధిత కుటుంబ సభ్యులతోను మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు .కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తాళ్లూరి జీవన్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ, పార్టీ కామేపల్లి మండల నాయకులు వడియాల కృష్ణారెడ్డి, తీర్దాల చిదంబరం, కృష్ణ ప్రసాద్,అచ్చయ్య, నూనావత్ సూర్య తదితరులు పాల్గొన్నారు