బ్రాహ్మణులకు, క్షత్రియులకు పరిమితమైన చదువును అన్ని వర్గాలకు అందించిన మహానుభావుడు జ్యోతిబా పూలే.
సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్.
……
సాక్షిత : మహాత్మా జ్యోతిబా పూలే 197 వ జయంతి సందర్భంగా జగతగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, కార్యదర్శి ఉమా మహేష్ లు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉదేశించి మాట్లాడుతూ 18 వ శతకంలో చదువు కేవలం బ్రాహ్మణ, క్షత్రియ కులాలకు పరిమితమై కింది కులాల వారు చదివితే నాలుక కోసివేయ్యడం, చెవిలో సీసం కరిగించి పోయడం లాంటి దూరచరాలు మూఢనమ్మకాలు ఏలుతున్న కాలంలో ప్రజల బాధలు తొలగాలంటే చదువు ద్వారానే సాధ్యమని గ్రహించి ముందుగా తన ఇంటి నుండే ప్రారంభించి మహారాష్ట్ర లో అనేక పాఠశాలలను నెలకొల్పి చదువును అన్ని వర్గాల ప్రజలకు చేర్చి చైతన్యాన్ని నింపిన మహానుభావుడు జ్యోతిబా ఫూలే అని అన్నారు.అందరికి చదువు నేర్పుతున్నారని తట్టుకోలేని బ్రాహ్మణ వర్గం వారిపై భౌతిక దాడులకు దిగిన భయపడకుండా బ్రాహ్మణ వర్గాలకు ఎదురుతిరిగి సత్య షోదక్ సమాజాన్ని ఏర్పాటు చేసి మూఢనమ్మకాలను పారద్రోలాడానికి పనిచేశారని అన్నారు.బాబా సాహెబ్ అంబెడ్కర్ కూడా జ్యోతి బా ఫూలే ను తన గురువుగా చెప్పుకున్న మహానుభావుడు ఫూలే అని అన్నారు.
ఆనాడు వారు కలలుకన్న సమసమాజ ని నేడు బీజేపీ మళ్ళీ ధర్మం పేరిట ప్రజలను విడదీస్తున్నారని కావున ప్రజలు నిజాన్ని తెలుసుకొని రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,శాఖ కార్యదర్శి సహాదేవరెడ్డి, జ్యోతి విలేకరి వెంకట్,సీపీఐ నాయకులు రాజు,జానకిరామ్,సోము ఇమామ్,నవీన్ గౌడ్,రాజేష్, శ్రీకాంత్,మల్లేష్,ఇమామ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.