స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశంలో అనేక సంస్కరణలను చేపట్టిన మహా యోధుడు బాబు జగ్జీవన్ రాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

129 -సూరారం డివిజన్ సూరారం మెయిన్ రోడ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ & బాబు జగ్జీవన్ రాం భవన్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేపడుతూ ఉప ప్రధానిగా స్థాయికి ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ ను ఆశయ సాధనకై అందరూ పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కిషన్ రావ్, దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ గట్టు అశోక్, భూదాల విజయభాస్కర్, సభ్యులు ఆర్.సిద్దయ్య, అమర్ బాబు, రవీందర్, బుచ్చన్న, సత్యనారాయణ, జీజే.రత్నం, అరుణ, వాణి, శ్యామల, అనిత, శివ, ఎన్.ఎస్. రాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page