హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో Pixel EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిభిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ Pixel EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే కాంక్ష చాలా గొప్పదని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు కొనియాడారు. ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని.. తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు. చాలామంది పేదలు అనారోగ్యానికి గురైనా, ప్రైవేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం చేయించుకునే స్థితిలో లేని వారందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఎంతగానో ఉపయోగపడతాయని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్ రషీద్, కృష్ణ, పూజిత, షబ్బీర్ మరియు కిందికుంట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.