SAKSHITHA NEWS

[6:53 PM, 3/21/2024] Sakshitha: సాక్షిత : * పి.ఓ డైరీ మరియు ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు ప్రిసైడింగ్ అధికారులు నమోదు చేయాలి

ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి పక్కాగా ఎన్నికల నిర్వహణ చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించబడిన ఎన్నికల విధులను ఎంతో పకడ్బందీగా, పూర్తి అవగాహనతో పీ.ఓ హ్యాండ్ బుక్ మేరకు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ అన్నారు.

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులకు మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఆన్ హ్యాండ్ శిక్షణ కార్యక్రమం జిల్లా యంత్రాంగం నిర్వహించగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ కళాశాల ఆడిటోరియం నందు చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని పీ.ఓ, ఎ.పీ.ఓ లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ముందుగా పరిశీలించి దిశా నిర్దేశం చేసిన అనంతరం తిరుపతి నియోజక వర్గానికి సంబంధించిన పీ.ఓ మరియు ఎపీఓలకు శిక్షణ జరుగుతున్న కచ్చపి ఆడిటోరియం నందు పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికల నిర్వహణ లో పి.ఓ ల పాత్ర చాలా కీలకమని, ఎప్పటికప్పుడు ఎన్నికలు కొత్తగా చూడాలని, ఈ సారి ఎన్నికలలో పలు కొత్త అంశాలు సూచనలు ఉన్నాయని, పూర్తిగా పీ.ఓ హ్యాండ్ బుక్ చదివి అవగాహన కలిగి ఉండాలి అని, అప్పుడు మా ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు మాత్రమే పోలింగ్ కేంద్రంలో పి.ఓ లు విధులు నిర్వహించాలన్నారు.
ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను ఉదయం 6.45 గం. లలోపు పూర్తి చేయాలని అన్నారు. మాక్ పోల్ జరపకుండా పోలింగ్ ప్రారంభించకూడదని, ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ ప్రారంభించాలన్నారు. పి.ఓ డైరీ, ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు పి.ఓ లు నమోదు చేయాలనీ సూచించారు. 17 (సి) ని రాజకీయ పార్టీల ఏజెంట్ల కు అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత సెక్టార్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియ చేయాలన్నారు. ఈవిఎం మరియు పోలింగ్ కేంద్రాలలో సమస్య లు ఉంటే సెక్టోరియల్ అధికారికి తెలియజేయాలని అన్నారు. విధులు కేటాయించబడిన నియోజకవర్గంలో ఆర్.ఓ ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పి.ఓ లు, ఏపీఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఈవిఎంలను పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లేటప్పటి నుండి తిరిగి ఈవీఎంలను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు బాధ్యతగా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ.సి.ఐ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయడం జరిగిందన్నారు.

మీ అందరి సురక్షితం మా బాధ్యత అని, సమిష్టిగా మనమందరం కలిసి మన జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లను విజయవంతం చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలపై 16 వీడియోలు ఉన్నాయని రిఫరెన్స్ కోసం వాటిని చూడాలని సూచించారు.

ఈ ఆర్ ఓ తిరుపతి అదితి సింగ్ మాట్లాడుతూ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వడం వలన ప్రతి ఒక్క ప్రిసైడింగ్ అధికారికి పూర్తి అవగాహన వస్తుందని, ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని, బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ జీఎం స్మార్ట్ సిటీ తిరుపతి చంద్రమౌళి, ఎస్దిసి మురళి పిఓల యొక్క పోలింగ్ నిర్వహణ బాధ్యతల గురించి విశదంగా శిక్షణ ఇచ్చారు. టెండర్ ఓట్, ఛాలెంజింగ్ ఓట్ తదితర అంశాలపై వివరించి, పలు ఫార్మాట్లపై ఆన్ హ్యాండ్ శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో నోడల్ అధికారులు ప్రతాప్ రెడ్డి, బాల కొండయ్య తదితర అధికారులు పీ.ఓ లు, ఎపిఓలు పాల్గొన్నారు.

డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి,

WhatsApp Image 2024 03 21 at 6.51.27 PM

SAKSHITHA NEWS