అబద్ధాల కాంగ్రెస్ ను ఓడిద్దాం
నామ గెలిస్తేనే భవిష్యత్
……
ఖమ్మం లో జరిగిన పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వక్తల ఉద్ఘాటన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
రానున్న పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో అబద్ధాల కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి ,అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి నామ నాగేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించుకుని, పార్లమెంట్‌కు పంపుదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఖమ్మం పార్లమెంట్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఖమ్మంలోని వీవీసీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్,జెడ్పీ ఛైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరావు, సండ్ర వెంకటవీరయ్య,మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు,కొండబాల కోటేశ్వరరావు , బాణోత్ మదన్‌లాల్ తదితరులు మాట్లాడారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దం నామ..ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల గొంతుకై పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున గళం విప్పిన సత్తా ఉన్న నాయకుడు నామ అని కొనియాడారు.కేసీఆర్,కేటీఆర్ దిశా నిర్ధేకత్వంలో పార్లమెంట్‌లో తెలంగాణ గురించి పోరాడిన గొప్ప నాయకుడు నామ అని పేర్కొన్నారు. ప్రస్ధుత మారిన రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో నామ గెలుపు అత్యంత అవశ్యమని అన్నారు.
కేసీఆర్ , కేటీఆర్ ఖమ్మం జిల్లాకు ఎంతో ఇచ్చారు…కానీ మనం ఆయనకేమి ఇవ్వలేదు..ఇప్పుడు ఆ సమయం వచ్చిందీ..నామను భారీ మెజార్టీతో గెలిపించుకుని, కేసీఆర్‌కు గిఫ్టుగా ఇద్దామని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరం బాధ్యతతో ఎన్నికల్లో పని చేసి, పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసుకుందామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ దిశా నిర్ధేశకత్వంలో ప్రతి ఒక్కరం సమైఖ్యంగా ముందుకు పోదామని అన్నారు. నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో అతికొద్ది సమయంలోనే ఎంతో మార్పు వచ్చిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్ధానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ సునాయసంగా గెల్చుకుని తీరుతుందని అన్నారు.గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాజీవితంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటున్నానని అన్నారు.ప్రజలే నా ఆయుధమని, వారి దీవెనలే నాకు గెలుపు ఆశీస్సులని, తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తానని అన్నారు.ఖమ్మం జిల్లా ప్రజలు రెండుసార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపితే పార్లమెంట్‌లో జిల్లా ప్రజల గొంతుకై, సమస్యలపై గళం విప్పానని,తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా పార్లమెంట్‌లో తన మొదటి ఓటును వేసి, తెలంగాణ ఏర్పాటులో ముందున్నానని అన్నారు.హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని,గత పదేళ్లలో సుభీక్షంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారని,కరెంట్, నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయని,అనేక సమస్యలతో రైతులు ఇబ్బందిపడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఖమ్మంలో తన గెలుపు తధ్యమని నామ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం మళ్ళీ తనకే ఉంటుందని నామ పేర్కొన్నారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కేసీఆర్ జిల్లాకు మహత్తర అవకాశాలు ఇచ్చారని, ఆయనకు మాత్రం మనం ఏమి ఇవ్వలేకపోయామని, ఇప్పుడు నామ నాగేశ్వరరావు గెలిపించుకుని, గిఫ్టుగా ఇద్దామని చెప్పారు. నామ సత్తా ఉన్నా నాయకుడని, ఢల్లీిలో ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని అన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రాణాలు ఒడ్డి సాధించిన తెలంగాణను అన్నింటా నెంబర్‌వన్‌గా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కష్టాలు పాలు చేస్తుందని అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంతా సమైఖ్యంగా కలిసి నామ నాగేశ్వరరావును గెలిపించుకుని,పార్టీని మరింత ముందుకు తీసుకుపోదామని పేర్కొన్నారు. నామ గెలుపే రాజకీయ లక్ష్యంగా ముందుకు సాగుదామని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కేసీఆర్,పార్టీ ఇచ్చిన లైన్‌లో నామ పార్లమెంట్‌లో జిల్లా ప్రజల వాణిని ఎంతో బలంగా వినిపించారని, కష్టకాలంలో కార్యకర్తకు అండగా ఉండే నామకు అండగా నిలుద్దామని అన్నారు. నామను గెలిపించుకుంటేనే అందరికీ భవిష్యత్ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.సమిష్టి కృషితో ఎన్నికల కదన రంగంలోకి దూకుదామని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. అన్ని అంశాలు ప్రజలు వివరించి, సమస్యలు గుర్తించి, ప్రజలకు అండగా ఉందామని అన్నారు. ఈ సందర్బంగా ఎంపీ నామ నాగేశ్వరరావును, వద్దిరాజు రవిచంద్రను శాలువతో ఘనంగా సన్మానించారు. అంతకముందు జిల్లా సరిహద్దుల్లో నుంచి వారిని ఊరేగింపుగా సమావేశ స్ధలి వద్దకు తీసుకువచ్చారు.ఈ సందర్బంగా భారీ కార్ల, మోటారు సైకిళ్ల ర్యాలీ జరిగింది. ఈ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బాణోత్ మదన్‌లాల్, బాణోత్ మదన్‌లాల్, చంద్రావతి, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమలరాజు, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, మాజీ డీసీసీబీ అధ్యక్షులు కూరకుల నాగభూషణం, బచ్చు విజయకుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ వైస్ ఛైర్మన్ మరికంటి ధనలక్ష్మీ, మధిర మున్సిపల్ ఛైర్మన్ మొండితోక జయకర్, మైనార్టీ నాయకులు ఖమర్, షౌకత్ ఆలీ,న్యాయవాద జేఏసీ నాయకులు బిచ్చాల తిరుమలరావు, పార్టీ నాయకులు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, ఉప్పల వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు, మహేశ్, కృష్ణ చైతన్య, జోగేశ్వరరావు, జెడ్పీటీసీ నాగమణి, కోనేరు చిన్నితో పాటు వివిధ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపీలు, జెడ్పీటీసీ,ఎంపిటీసీలు తదితరులు పాల్గొన్నారు.