ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ భవిష్యత్‌ను, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి వచ్చిన వారందరికి మనస్ఫూర్తిగా అభినందనలు
ఎల్బీ స్టేడియం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది..
ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు, రైతులపై ఉన్న అక్రమ కేసులు, విద్యుత్ బకాయిలు రద్దు చేస్తూ మొదటి సంతకం చేసి మన ప్రాంతంలో రైతును రాజును చేస్తూ పునాది పడ్డది ఈ ఎల్బీ స్టేడియంలోనే…
మూడు నెలల కాలంలోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంతకాలు పెట్టాం…
నేను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియం మాత్రమే చదివాను: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగాను
వేలాది గురుకులాలు నిర్మించామని గత పాలకులు గొప్పగా చెప్పారు
ఎక్కడా గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించలేదు
రేషనైలేజేషన్ పేరిట కేసీఆర్ 6 వేల పాఠశాలను మూసివేశారు