దళితలపై మంత్రి కాకాణి దమనకాండ
దళిత ద్రోహి ముమ్మాటికి కాకాణి గోవర్ధన్ రెడ్డే
దళితుల పక్షపాతి, దళితుల పెన్నిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మనుబోలు మండలం కట్టువపల్లిలో దళితుడైన బల్లి వెంకటయ్యకు మద్యం పోయించి టీడీపీ నాయకులపై ఉసికొల్పడం దుర్మార్గం
వైసీపీ కార్యకర్త వెంకటయ్య గడ్డపార తీసుకొచ్చి ఎంత గందరగోళం చేశాడో మా వద్ద వీడియోలతో సహా ఉన్నాయి
టీడీపీ నాయకులపై దౌర్జన్యం చేసి మళ్లీ టీడీపీ నాయకులపైనే కేసులు పెట్టడం వైసీపీ దుర్మార్గాలకు పరాకాష్ట
వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎస్సీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఫైర్ అయినా టీడీపీ మండలాధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్
స్క్రోలింగ్ పాయింట్స్..
సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉంది
మంత్రి కాకాణికి మనీ మీద ఉన్న మోజు సర్వేపల్లి ప్రజలపై లేదు
మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఎంతోమంది దళితులు జీవన ఉపాధి కోల్పోతే వారికి నష్టపరిహారం కూడా అందించలేదు
కొన్ని దళిత కుటుంబాలు ఏకంగా ఇల్లు దెబ్బతిని నష్టపోతే వారికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా మెక్కేసిన మహానుభావుడు ఎవరు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 57 నెలల్లో దళితులకు ఒక్క కార్పొరేషన్ రుణమైనా ఇప్పించారా
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏమైనట్టు.. దీనికి మన కాకాణి గోవర్ధన్ రెడ్డే దళిత సోదరులకు సమాధానం చెప్పాలి
పుంజులూరుపాడులో మా నాయకుడు సోమిరెడ్డి గారికి హారతి ఇచ్చిందని అక్కసుతో దళిత మహిళ దాసరి కామాక్షమ్మ పొట్టకూటి కోసం పెట్టుకున్న అంగడిని సైతం మంత్రి కాకాణి తొలగించిన మాట వాస్తవం కాదా
ఇలా చెప్పుకుంటూ పోతే సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి దళితులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. లెక్కకు మించినన్ని…
రాజకీయ లబ్ధికోసం దళితులను వాడుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి దళితుల మీద చులకన భావన తప్ప మరొకటి లేదు
దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నదెవరు కాకాణి
ఉదయగిరి నారాయణను కొట్టి చంపిన ఎస్ఐ కరీముల్లాను కాపాడింది ఎవరు కాకాణి
కనుపూరులో దళితునిపై అక్రమంగా పోలీసుల చేత కొట్టించింది ఎవరు
కసుమూరు చింతలపాలెంకు చెందిన దళిత నాయకుడు మంద రమణయ్య పై రౌడీ మూకలతో దాడి చేయించి ఆపై అతనిపైనే తప్పుడు కేసు బనాయించేలా చేసింది ఎవరు
చవటపాళెం దళిత నాయకుడు మంగళంపురి రవి పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించింది ఎవరు మీరు కదా
దళితులపై నీకు చిత్తశుద్ధి ఉంటే దళిత సోదరులకు నువ్వు ఏం మంచి చేశావో నువ్వే చెప్పు కాకాణి
గొలగమూడిలో ఒక ఎస్టీ యువకుడ్ని అప్పటి ఎస్ఐ కరిముల్లా చేత దారుణంగా కొట్టించి.. ఆ యువకుడికి మతిస్థిమితం వచ్చేలా చేసింది ఎవరు
దళితులు, గిరిజనుల ప్రాణాలు తీసిన ఎస్ఐ కరీముల్లాని తీసుకుని వెళ్లి నీ సొంత మండలంలో పోస్టింగ్ ఇప్పించి.. నీ పక్కనే పెట్టుకుంది ఎవరు
దళితులకు ఏదో చేసినట్లు సత్య హరిశ్చంద్రుడిలా నీతి మాటలు చెప్పకు…కాకాణి
దళితుల పట్ల నువ్వు చేయించిన అరాచకాలు దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావు
వైసీపీ 57 నెలల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు ఇలా ఒక్కక్కటిగా చెప్పుకుంటుపోతే రోజులు సరిపోవు
2015లో వచ్చిన వరదలు, తుఫాన్ కారణంగా ఆనాడు మా ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వరద సాయం కింద 25 కేజీల బియ్యం,4000 వేలు నగదు, నిత్యవసర సామాగ్రిని అందించారు
మరి మన మహానుభావుడు కాకాణి మొన్న వచ్చిన మిచౌంగ్ తుఫాన్ కు దళిత కుటుంబాలకు ఏం సహాయం అందించాడు
దళితులకు సంక్షేమ పథకాలకు దూరం చేసి తీరని ద్రోహం చేస్తున్నారు
ఎస్సీ కార్పొరేషన్, సబ్సిడీ రుణాలు లేకుండా చేశారు.. మరి మీరా దళితుల గురించి మాట్లాడేది
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే
వైసీపీ నాయకుల అక్రమాలను ఏ ఒక్క దళితుడైన ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురిచేసింది ఎవరు
మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపై నువ్వు, నీ ప్రభుత్వం అక్రమంగా పెట్టించిన 11 కేసులున్నాయి. ఆయనేం నీలా గోడలు దూకి పారిపోలేదు
మా నాయకుడు సోమిరెడ్డి గారు నీపై పెట్టిన కేసుకు పంచతడుపుకొని పంచమిదే గోడ దూకి రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లి బెయిల్ తెచ్చుకుంది నువ్వు కదా..
ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హెడ్ కానిస్టేబుల్ ఎదుట సంతకాలు పెట్టింది ఎవరో సర్వేపల్లి ప్రజలందరికీ తెలుసులే..
మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీలా కేసులకు భయపడే వ్యక్తి కాదు.. కేసులంటే భయమే లేదు
సర్వేపల్లి నియోజకవర్గంలో నీ అనుచరుల చేత మండల కేంద్రాలలో ప్రెస్ మీట్లు పెట్టించి మా నాయకుడు దళిత ద్రోహి అని అనిపించినంతమాత్రాన.. దళిత ద్రోహి ఎవరో, దళిత పక్షపాతో ఎవరన్నది దళిత సోదరులకు అంతా బాగా తెలుసు
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దళిత సోదరులే నీకు తగిన బుద్ధి చెబుతారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దాసి చక్రధర్, ఎస్సీ సెల్ సర్వేపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మందా రమణయ్య, ఎస్సీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి గిద్దలూరు వెంకటేశ్వర్లు, తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు తాటిపర్తి వేణు, తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి ఆస్తోటి నాగరాజు, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు నలబాలపు వెంకటాద్రి, తెలుగు యువత మండల కార్యదర్శి ఆత్మకూరు ఆదిశేషయ్య, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి మోమిడి వెంకటసుబ్బయ్య, మండల కార్యనిర్వాహక కార్యదర్శి గిద్దలూరు ముని చంద్ర, ఎస్సీ సెల్ మండల సీనియర్ నాయకులు మొండెం శ్రీనివాసులు, దార్ల వెంకటరమణయ్య, పొట్టెల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.