24 గంటల వ్యధిలోనే బోరు ఏర్పాటు….

Spread the love

హర్షం వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు గ్రామం శ్రీనివాస కాలనీ వాసులు…

‘ఇదే కదా ఎమ్మెల్యే ఆర్కే మార్క్ పని తీరు’ అంటూ ప్రశంసలు..

నిన్న ఆత్మకూరు శ్రీనివాస కాలనీ నందు ఇటీవల నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ స్థలాల ప్రహరీ గోడల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆర్కేకు స్థానిక కాలనీవాసులు పార్క్ స్థలంలో స్థలంలో మంచినీటి బోరు ఏర్పాటు చేయమని కోరారు…

స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే నిమిషాల వ్యవధిలో బోరు పనులు ప్రారంభించిన పిదపే అక్కడి నుండి కదిలారు…

ఉదయం బోరు పనులు పూర్తి కావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే సమక్షంలో మంచినీటి బోరు స్విచ్ ఆన్ చేశారు…

అడిగిందె తడువుగా చెప్పిన ప్రతి సమస్యను క్షణాల వ్యవధిలో పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆర్కేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page