ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణం : టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
సాక్షితతిరుపతి నగరం:
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి ప్రధాన కారణం మీరేనని వాలంటీర్లను ఉద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటి ఆడిటోరియంలో జరిగిన తిరుపతి నియోజకవర్గంలోని వాలంటీర్ల సత్కార కార్యక్రమానికి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ చేతుల మీదుగా వాలంటీర్లకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగనన్న మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారంటె అందులో మీ పాత్ర కీలకమని, వాలంటీర్లంతా దీక్షా దక్షతతో పనిచేయండని, ఈ ప్రభుత్వం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుందని భూమన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్న మీ వాలంటీర్లందరికి హృదయ పూర్వక అభినందనలని భూమన పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడున్నార లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందజేయడం జరిగిందన్నారు. వాలంటీర్ల సేవలు అత్యున్నమైనవని, మీ సేవలకు విలువ కట్టలేమన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని చూసి సహించలేని కొందరు ద్వేషంతో సంఘ విద్రోహులుగా మిమ్మల్ని విమర్శించడం సహించరానిదన్నారు. జగనన్న ముఖ్య మంత్రి కాకపోతే ప్రజా పథకాలన్ని ఆగిపోతాయని, వాలంటీర్ వ్యవస్థనే తొలగిస్తారని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కరోనా కాలంలో వాలంటీర్లే ప్రజలకి సేవలందించారని, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి తీసుకొచ్చిన ఘనత ఓక్క జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రజా పథకాలను నేరుగా ప్రజల వద్దకే తీసుకెల్లాలనే లక్ష్యంతో ఏర్పర్చిన వాలంటీర్ల వ్యవస్థ చాలా భాగా పని చేస్తున్నదన్నారు. దేశంలోనే వాలంటీరీ వ్యవస్థ ఓక ప్రత్యేకత సంతరించుకున్నదన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేద వారే ప్రామాణికంగ సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలకు వాలంటీర్ల సహకారం మరువలేనిదన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ నందు 1885 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డ్ పేరిట 15,000 రూపాయల చొప్పున 2,87,55,000 రూ.లను, 18 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డ్ పేరిట 30 వేల చొప్పున 5,40,000 రూ.లను, 5 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు పేరిట 40 వేల చొప్పున 2,25,000 రూ.లను మొత్తంగా 1908 మంది వాలంటీర్లకు 2,90,40,000 రూపాయలను అందించడం జరిగిందన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ప్రజలకు నవరత్న పథకాల ద్వారా అండగా వుంట్టున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మనమంతా తోడుగా వుండాలన్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చారని ముద్రనారాయణ వాలంటీర్లను వుద్దేశించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, దొడ్డారెడ్డి ప్రవళ్ళికా రెడ్డి, కోటూరు ఆంజినేయులు, ఆధం రాధాకృష్ణ రెడ్డి, దూది కుమారి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దేవదానం, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపర్డెంట్లు పి.రవి, సురేంధ్ర రావు, ఆర్వో సేతుమాధవ్, మేనేజర్ చిట్టిబాబు, శశి, సాహుల్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణం
Related Posts
నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
SAKSHITHA NEWS నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ శివారు సూరాయపాలెంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి గుడివద్ద నాభిశిల (బొడ్డురాయి) ప్రతిష్ట మహోత్సవం…
రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం
SAKSHITHA NEWS కృష్ణాజిల్లా గుడివాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం ట్రాఫిక్ రద్దీపై చర్యలు చేపట్టిన:- ట్రాఫిక్ ఎస్ఐ జీ వి ప్రసాదరావు గుడివాడ పట్టణం కే.టి.ఆర్ కాలేజ్ గేట్ వద్ద ట్రైన్ వెళ్లే సమయంలో గేట్ కి…