SAKSHITHA NEWS

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు. డిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు స్పందించరాదని, పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదన్నారు.

సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటలను నమ్మరాదని, సైబర్ నేరాలకు గురైతే 1930కి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే లింక్లను క్లిక్ చేయరాదని, సందేశాలకు స్పందిచరాదని తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 21 at 4.59.50 PM

SAKSHITHA NEWS